IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్

IPL Mega Auction 2025 : అర్షదీప్ సింగ్ ను రూ.18 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. సన్ రైజర్స్ పోటీకి రాగా, అంతే మొత్తానికి రైటు టు మ్యాచ్ కింద పంజాబ్ దక్కించుకుంది.

Continues below advertisement

Right to Match option for Arshdeep Singh | జెడ్డా: టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ భారీ ధర పలికాడు. ఐపీఎల్ 2025 వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్ ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజులపాటు జరగనున్న ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైంది.
రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన అర్షదీప్ సింగ్ ను సన్ రైజర్స్ దక్కించుకునేందుకు చూడగా రైట్ టు రీటైన్ కింద పంజాబ్ అదే మొత్తం రూ.18 కోట్లు చెల్లించి అర్షదీప్ ను తీసుకుంది.

Continues below advertisement

 

 

అర్షదీప్ సింగ్ - రూ.18 కోట్లు  పంజాబ్ కింగ్స్ 
కగిసో రబాడ - రూ.10.75 కోట్లు గుజరాత్ టైటాన్స్
శ్రేయస్ అయ్యర్ - రూ.26.75 కోట్లు  పంజాబ్ కింగ్స్
జాస్ బట్లర్ - రూ.15.75 కోట్లు గుజరాత్ టైటాన్స్
మిచెల్ స్టార్క్ - రూ.11.75 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 
రిషభ్ పంత్ - రూ.27 ఢిల్లీ క్యాపిటల్స్

 

సెకండ్ సెట్
మహ్మద్ షమీ - రూ.10 కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ మిల్లర్ - రూ. 7.5 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్
యుజువేంద్ర చాహల్ - రూ.18 కోట్లు, పంజాబ్ కింగ్స్
మహ్మద్ సిరాజ్ - 12.25 కోట్లు, గుజరాత్ టైటాన్స్

Continues below advertisement