IND vs AUS 1st Test Indian Openor Yashasvi Jaiswal maiden Test 100 on Australian soil పెర్త్: టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అద్భుత శతకం సాధించాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సిక్సర్ బాది సెంచరీ మార్క్ చేరుకున్నారు. హజెల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 62వ ఓవర్లో 5వ బంతి బౌన్సర్ సంధించగా జైస్వాల్ ఫైన్ లెగ్ దిశగా బంతిని బౌండరీగా మలవడంతో సంబరాలు భారత శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. 205 బంతుల్లో జైస్వాల్ నాలుగో టెస్టు శతకం చేయగా, ఆస్ట్రేలియా గడ్డ మీద జైస్వాల్‌కిది తొలి సెంచరీ కావడం విశేషం.
200 పరుగుల భాగస్వామ్యం
ఓవర్ నైట్ స్కోరు 172 పరుగులతో భారత ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ మూడో రోజు ఆట మొదలుపెట్టారు. జోరు కొనసాగించిన లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ జైస్వాల్ ఆసీస్ బౌలర్ హజెల్‌వుడ్ బౌలింగ్ లో బౌన్సర్ ను సిక్సర్‌గా మలిచి టెస్టు కెరీర్ లో నాలుగో శతకం నమోదు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద తనకు ఇది తొలి సెంచరీ. అది కూడా తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం చేయడం జైస్వాల్ కెరీర్‌లో మరుపురాని ఇన్నింగ్స్ ఇది. ఈ క్రమంలో భారత ఓపెనర్ రాహుల్, జైస్వాల్ లు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 20 ఏళ్ల తరువాత ఆసీస్ గడ్డమీద భారత ఓపెనర్లు శనివారం నాడు సెంచరీ భాగస్వాయ్యం నెలకొల్పగా, నేడు దాన్ని 200కు తీసుకెళ్లారు.
అనంతరం ఓపెనర్ కేఎల్ రాహుల్ (77 పరుగులు ; 176 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్ ఆసీస్ కు తొలి వికెట్ అందించాడు. స్టార్క్ బౌలింగ్ లో రాహుల్ ఆడిన బంతిని వికెట్ కీపర్ అందుకోవడంతో తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతానికి భారత్ 69 ఓవర్లలో 220/1 గా ఉంది. సెంచరీ వీరుడు యశస్వీ జైస్వాల్ (115 పరుగులు నాటౌట్; 228 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ పడిక్కల్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత్ ఆధిక్యం 266కు చేరింది. 350 లేదా 400 చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో విఫలమైంది. భారత పేసర్లు చెలరేగడంతో 104 పరుగులకు ఆలౌంటైంది. ఈ మ్యాచ్‌లో జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు.
భారత్ తొలి ఇన్నింగ్స్ - 150 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ - 104 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ - 231/1 (72 ఓవర్లు)