Shreyas Iyer Dhanashree Verma:టీమిండియా ఆఫ్ స్పిన్నర్  యుజ్వేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మల మధ్య  మరో  వ్యక్తి వచ్చాడా..?  అతడి కారణంగానే గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవని..  విడాకులు ఖాయమనేన్న  గుసగుసలు కొన్నిరోజులుగా  వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టులు, వాటిలో  చహల్ లేకపోవడం, ఉన్నా అతడిని పట్టించుకోకపోవడం వంటివి  నిత్యకృత్యమయ్యాయి.  


అయితే చహల్ - ధనశ్రీ మధ్య టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్  చిచ్చు పెట్టాడని సోషల్ మీడియా చాలారోజులుగా కోడై కూస్తున్నది. ఇది నిజమేనా..? అన్నట్టుగా  అయ్యర్ చేష్టలు కూడా ఇందుకు  ఉప్పు అందిస్తున్నాయి. ధనశ్రీతో డాన్స్‌లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఏదైనా పార్టీలలో క్లోజ్‌గా  ఫోటోలు దిగడాలు వంటివి   లేనిపోని అనుమానాలను  క్రియేట్ చేస్తున్నాయి. ఇక ధనశ్రీ షేర్ చేసే ఫోటోలలో  చహల్ లేకపోయినా పెద్దగా పట్టించుకోని  నెటిజన్లు అయ్యర్ లేకుంటే మాత్రం.. ‘శ్రేయాస్ అయ్యర్ ఎక్కడ..?’అని బాహాటంగానే అడుగుతున్నారు. మొన్నామధ్య  శార్దూల్ ఠాకూర్ పెళ్లిలో కూడా  ధనశ్రీ-అయ్యర్‌ల ఫోటో కూడా వైరల్  అయింది. 


 






అనుమానమే నిజం చేస్తూ.. 


ఈ ఇద్దరి మధ్య   రిలేషన్‌షిప్ రూమర్స్ ‌ను నిజం చేస్తూ  తాజాగా  ధనశ్రీ వర్మ ఇన్‌స్టా స్టోరీస్ లో పెట్టిన  ఫోటోలు  నెట్టింట వైరల్ అవుతున్నాయి.  ఒక ఇఫ్తార్ పార్టీకి వెళ్లిన ధనశ్రీ.. తన ఫ్రెండ్స్‌తో హంగామా చేసింది.  లేడీస్  పార్టీగా ఉన్న  ఈ ఫోటోలలో వెనుక శ్రేయాస్ అయ్యర్ కనిపించడం అనుమానాలకు తావిస్తున్నది.   వెన్ను గాయం అయిందని టీమ్ నుంచి తప్పుకున్నప్పుడే అయ్యర్ పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు   సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటివాళ్లు బహిరంగంగానే.. ‘అసలు బ్యాటర్ కు వెన్ను నొప్పి ఏంటో ఏం అర్థం కావడం లేదు’అని కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా  ఈ కామెంట్స్ పై రచ్చ జరిగింది. ‘వెన్ను నొప్పి వచ్చేంతగా ఏం చేశావ్ అయ్యర్ భయ్యా..’ అని  నెటిజన్లు ఆటాడుకున్నారు.  టీమిండియాకు టెస్టులలో అజింక్యా రహానే ప్లేస్ ను రిప్లేస్ చేసి వన్డేలలో కూడా  నిలకడగా రాణిస్తున్న అయ్యర్ పై భారత జట్టు కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. కానీ గతేడాది బంగ్లా టూర్ తర్వాత వెన్ను గాయం కారణంగా అయ్యర్  క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు.  ఇటీవలే భారత్ - ఆస్ట్రేలియాల మధ్య  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండు టెస్టులు ఆడాడు. అహ్మదాబాద్ టెస్టు మధ్యలోనే  గాయంతో  దూరమయ్యాడు. 


 






కాగా ఐపీఎల్ నుంచి  తప్పుకున్న తర్వాత అయ్యర్ వాస్తవానికి రిహాబిటేషన్ కోసం బెంగళూరులోని జాతీయ  క్రికెట్ అకాడమీకి వెళ్తాడని వార్తలు వచ్చాయి.  ఇక్కడ రిహాబ్ క్యాంప్ ముగిసినాక యూకేకు వెళ్లి సర్జరీ చేయించుకుంటాడని  బీసీసీఐ వర్గాలు చెప్పాయి. మరి  ఎన్సీఏలో ఉండాల్సిన  అయ్యర్..  ధనశ్రీ వెళ్లిన ఇఫ్తార్ పార్టీకి ఎందుకు వెళ్లాడనేది అంతుచిక్కని  ప్రశ్న. ఏదేమైనా   అయ్యర్.. చహల్ కొంపలో కుంపటి పెట్టేశాడని.. ధనశ్రీతో  ఇక విడాకులు ఖాయమేనన్న వదంతులు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుందో మరి...!