Rajasthan Royals vs Delhi Capitals: ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్ రాయల్స్  20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (79: 51 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (60: 31 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించాడు.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (79: 51 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్), జోస్ బట్లర్ (60: 31 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో యశస్వి జైస్వాల్ ఐదు ఫోర్లు కొట్టాడు. జోస్ బట్లర్ కూడా అదే ఊపు కొనసాగించాడు. దీంతో రాజస్తాన్ పవర్ ప్లే ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో యశస్వి జైస్వాల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


ఆ తర్వాత కాసేపటికే యశస్వి జైస్వాల్ అవుటయ్యాడు. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ మొదటి వికెట్‌కు 8.3 ఓవర్లలోనే 98 పరుగులు జోడించారు. కెప్టెన్ సంజు శామ్సన్ (0: 4 బంతుల్లో) డకౌట్ అయ్యాడు. తర్వాత రియాన్ పరాగ్ (7: 11 బంతుల్లో) కూడా విఫలం అయ్యాడు. చివర్లో జోస్ బట్లర్‌కు షిమ్రన్ హెట్‌మేయర్ (39 నాటౌట్: 21 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) జత కలిశాడు. ముఖ్యంగా హెట్‌మేయర్ సిక్సర్లతో చెలరేగాడు. దీంతో రాజస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, రొవ్‌మన్ పావెల్‌లకు చెరో వికెట్ దక్కింది.






ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, రిలీ రోసోవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్


ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
అమన్ హకీమ్ ఖాన్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ఇషాంత్ శర్మ, ప్రవీణ్ దూబే


రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్


ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
నవదీప్ సైనీ, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, డోనావన్ ఫెరీరా