టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. మరోవైపు క్రీజు వెలుపల జాత్యంహకారం విద్వేషాన్ని రేపుతోంది. భారత అభిమానులకు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ జాతి విద్వేష కామెంట్లతో అవమానించడం మరో వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఎడ్జ్ బాస్టన్ టెస్టు మ్యాస్ సందర్భంగా వెలుగు చూసిన జాత్యంహకార ఘటన ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు చేరింది. దీనిపై తాము దర్యాప్తు చేస్తామని బోర్డ్ ప్రకటించింది. ఇంగ్లాండ్ గడ్డపై ఇలాంటి ఘటన జరగడం తమను కలచివేసిందని, దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేసింది.
ఆస్ట్రేలియాలోనే ఇదే తీరుగా..
గతంలో ఆస్ట్రేలియా పర్యటనల్లో తరచుగా ప్రత్యర్థి జట్లకు అవమానాలు ఎదురయ్యేవి. భారత్ జట్టుకు సైతం ఆసీస్ టీమ్ నుంచి మంకీ గేట్ వివాదం రావడం కొందరు ఆటగాళ్ల డిప్రెషన్‌కు కారణమైంది. ఆపై గత సిరీస్‌లో సిరాజ్‌పై జాతి విద్వేష వ్యాఖ్యలు చేయడంతో జట్టు ఆసీస్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఇంగ్లాండ్, టీమిండియా జట్లు నిర్ణయాత్మక 5వ టెస్టును బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఆడుతున్నాయి. ఓ వైపు టెస్ట్ మ్యాచ్ జరుగుతుంటే.. భారత ఆటగాళ్లను టార్గెట్ చేసుకుని అసభ్య పదజాలంతో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ క్రికెట్‌లో జాత్యహంకారం మరీ తీవ్ర స్థాయిలో ఉందని, యార్క్‌షైర్ మాజీ క్రికెటర్ అజీమ్ రఫీక్ తెలిపారు. యార్క్‌షైర్‌లోనూ ఇదే తీరుగా భారత క్రికెట్ జట్టు అభిమానులను అవమానించారని పదే పదే దూషిస్తూ వారిని టార్గెట్ చేస్తున్నారని గుర్తుచేశారు.
10 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు..
ఇంగ్లాండ్ ఫ్యాన్స్ తమను దారుణమైన మాటలతో వేధించారని, జాత్యహంకార వ్యాఖ్యలపై దాదాపు 10 సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని వారిని వారించబోతే.. మూసుకుని సీట్లో కూర్చోని మ్యాచ్ చూడండని ఎంతో అహంకారంతో బదులిచ్చారని చెప్పారు. వారు చేసిన కొన్ని వ్యాఖ్యలకైతే మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారని ఓ నెటిజన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎడ్జ్ బాస్టన్ ప్రతినిధి స్టూవర్ట్ కెయిన్ మాట్లాడుతూ.. మేం స్టేడియంలో ప్రతాంత వాతావరణం ఉంచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాం. ఫిర్యాదు చేసిన వ్యక్తిని నేను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి సమస్య తెలుసుకున్నాను. జాత్యహంకార వ్యాఖ్యలతో పాటు ఏదైనా తప్పిదాలు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు.
Also Read: IND vs ENG, Day 4 Highlights: నాలుగో రోజు ఇంగ్లండ్‌దే - విజయానికి 119 పరుగులు!