ఎప్పుడైతే ఇండియన్ టీం దుబాయ్ లో మాత్రమే ప్రస్తుత చాంపియస్ ట్రోఫీ ఆడుతూ ఎక్స్ట్రా బెనిఫిట్ పొందుతుంది అంటూ  ఇంగ్లాండ్ మాజీలు విమర్శలు చేశారో అప్పటినుంచి సోషల్ మీడియా లో ఇండియన్ క్రికెట్ అభిమానులు, సునీల్ గవాస్కర్ లాంటి మాజీ దిగ్గజ క్రికెటర్లు ఇంగ్లాండ్ ఆరోపణలకు గట్టిగానే జవాబిస్తున్నారు. దుబాయ్ పిచ్ పై ఇండియన్ టీం కు ఎగస్ట్రా బెనిఫిట్ వస్తుందన్న ఇంగ్లాండ్ టీమ్ పాకిస్తాన్ గ్రౌండ్స్ పై ఎందుకు ఓడిపోతుందో చెప్పాలంటూ మాజీ దిగ్గజాలు కౌంటర్స్ వేస్తున్నారు.  


చివరికి ఆఫ్గాన్ లాంటి నయా టీములపై కూడా వరుస వాటములు చవిచూస్తున్న ఇంగ్లాండ్ ముందు తన అహంకారాన్ని తగ్గించుకుని తమను తాము  ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో  ఇంగ్లాండ్ టీమ్ అహంకారం గతంలో ఎలా ఉంటుందో చెబుతూ ఇండియన్ మాజీ కెప్టెన్ 'మిస్టర్ డిపెండబుల్ ' రాహుల్ ద్రవిడ్ మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది 


మమ్మల్ని సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు : రాహుల్ ద్రవిడ్ 
ప్రపంచ క్రికెట్ ను బీసీసీఐ ఈరోజు శాసిస్తుందంటే దాని వెనక ఎంత కష్టం ప్రయాస ఉందో చెబుతూ 1996లో తాము ఇంగ్లాండ్ టూర్ కి వెళ్ళినప్పుడు ఇండియన్ టీం ని సెకండ్ క్లాస్ పౌరుల్లా చూసేవారని  ఆ సమ్మర్ లో  అందరికంటే ముందు ఇంగ్లాండ్ టూర్ కి వెళ్ళిన టీం తమదే అయినా తమకు చిన్నచిన్న గ్రౌండ్లలో మాత్రమే ఆడనిచ్చేవారనీ తమన్న సెకండ్ క్లాస్ పౌరుల్లా మాత్రమే చూసే వారిని ద్రవిడ్ తెలిపారు. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్తే " మీరు ఆటపై దృష్టి పెట్టండి  15 ఏళ్లలో ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి ఇండియాను తీసుకువెళతామంటూ " తమకు మాటిచ్చారని దాని ప్రకారమే ఈరోజు క్రికెట్ లో ఇండియా  తన ఆధిపత్యాన్ని చూపించే స్థాయికి తీసుకెళ్లిందని దీని వెనుక ఉన్న బీసీసీఐ అధికారుల కష్టాన్ని గుర్తించాలంటూ ప్రశంసించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ క్లిప్ వైరల్ అవుతోంది. 


వీడియో కోసం క్లిక్ చేయండి


https://www.facebook.com/reel/2040826173104660


ఉపఖండం దేశాలను లైట్ తీసుకుంటున్న ఇంగ్లాండ్ : మాజీ దిగ్గజాలు 
ఇంగ్లాండ్ టీం  ఉపఖండ దేశాలైన ఇండియా పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్  టీమ్ లను చిన్న చూపు చూస్తోందని అందుకే ఇక్కడి పిచ్ లకు తగ్గట్టుగా వాళ్ల బౌలింగ్ కోచ్లను నియమించుకోరని ఆఫ్ఘనిస్తాన్ లాంటి నయా టీములపై కూడా ఓటమికి ఇదే కారణమని  పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్ లాంటి వాళ్ళు చెబుతున్నారు. 


గతంలో సచిన్ టెండూల్కర్ ను కూడా అవమానించిన ఇంగ్లాండ్


 2019 వన్డే వరల్డ్ కప్ ని ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత బెన్ స్టోక్, సచిన్ కలిసి ఉన్న ఫోటో ను షేర్ చేస్తూ " ద గ్రేటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆల్ టైం అండ్ సచిన్ టెండూల్కర్ " అంటూ ఐసీసీ వరల్డ్ కప్ పేరుతో చేసిన ట్వీట్ తీవ్ర వివాదాస్పదమైంది. ఆ వరల్డ్ కప్ జరిగింది ఇంగ్లాండ్ లోనే. ఇక  2007లో జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్ లో అండ్రు ఫ్లింటాఫ్ కావాలనే యువరాజ్ సింగ్ ని రెచ్చగొట్టడానికి స్టూవర్ట్ బ్రాడ్ వేసిన తర్వాతి ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ కౌంటర్ ఇవ్వడం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఇలా అవకాశం ఉన్నప్పుడల్లా ఇండియన్ టీం పై తన అక్కసును చూపుతోంది ఇంగ్లాండ్ టీమ్ అంటూ ప్రస్తుతం భారతీయ క్రికెట్ అభిమానులే కాకుండా  మాజీ దిగ్గజ క్రికెటర్లు సైతం మండిపడుతున్నారు.