Jasprit Bumrah News: సిడ్నీ టెస్టులో భారత్ కు చిన్నపాటి షాక్ తగిలింది. భారత ఏస్ పేసర్, స్టాండిన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా రెండో సెషన్ మధ్యలోనే మైదానం వీడి వెళ్లిపోయాడు. గాయం ఏమైనా అయిందా..? అన్న ప్రశ్నలు వేధిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఆసీస్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు బీసీసీఐ మేనేజర్ అన్షుమన్ తో కలిసి మైదానం వీడి వెళ్లిపోతున్న వీడియో కనిపించింది. స్కాన్ కోసం డాక్టర్ల వద్దకు బుమ్రా వెళ్లినట్లు తర్వాత కామేంటేటర్లు ధ్రువీకరించారు.


అయితే బుమ్రాకు అయిన గాయం గురించి సమాచారం లేదు. అయితే సోషల్ మీడియాలో బుమ్రా బయటకు వెళ్లిపోతున్న వీడియో వైరలైంది. బుమ్రాకు ఏమైందోనని అభిమానులు కామెంట్లతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత టాప్ బౌలర్ అయిన బుమ్రాకు ఏమీ కాకుడదని ప్రార్థనలు చేస్తున్నారు. సిడ్నీ టెస్టులో భారత్ ముందంజలో ఉన్న దశలో బుమ్రా బౌలింగ్ చేస్తే, ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. 






రెండోరోజు హుషారుగా బుమ్రా..
నిజానికి శనివారం ఐదో టెస్టు రెండో రోజు బుమ్రా మంచి టచ్ లోనే కనిపించాడు. ఆరంభంలోనే మార్నస్ లబుషేన్ వికెట్ తీసి భారత శిభిరంలోనే ఆనందం నింపాడు. ఆ తర్వాత ఆ సెషన్లోల మరో మూడు ఓవర్లు వేసి లంచ్ విరామానికి వెళ్లాడు. ఇక బుమ్రా బౌలింగ్ వేస్తున్నప్పుడు ఎలాంటి అసౌకర్యం కలిపించలేదు. నిలకడగా 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత లంచ్ సెషన్ ముగిశాక మరో మూడో ఓవర్ల చిన్న స్పెల్ ను సౌకర్యవంతంగానే వేశాడు. ఆ తర్వాత మరో ఓవర్ వేసిన బుమ్రా మైదానం వీడి వెళ్లిపోయాడు. 


టాప్ బౌలర్ బుమ్రా..
2024-25 బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. ఇప్పటివరకు మొత్తం 32 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 2001లో హర్భజన్ సింగ్ పేరిట నమోదైన బీజీటీలో అత్యధిక వికెట్ల రికార్డును సమం చేశాడు. ఇక మరో నాలుగు వికెట్లు ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక వికెట్టు తీసిన బౌలర్ గా బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ  రికార్డు 1972లో బీఎస్ చంద్రశేఖర్ ఇంగ్లాండ్ పై నమోదు చేశాడు. దీంతో బుమ్రా తిరిగొచ్చి ఈ రికార్డను తన ఖాతో వేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇక సిడ్నీ టెస్టు పోటాపోటీగా నడుస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 185 పరుగులకు ఆలౌటవగా, ఆసీస్ 181 రన్స్ చేసింది. దీంతో 4 పరుగుల స్వల్ప లీడ్ లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ప్రస్తుతం 8 ఓవర్లలో కేఎల్ రాహుల్ (13) వికెట్ నష్టపోయి 46 పరుగులు చేసింది. ఓవరాల్ గా 50 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ (22 బ్యాటింగ్) దూకుడుగా ఆడుతున్నాడు.


Also Read: Sydney Test Live Updates: ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బుమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్