ICC Champions Trophy 2025 Ind Vs Aus Semis Trolls: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ కు చేరడంతో భారత ఫ్యాన్స్ పాకిస్థాన్ ని ట్రోల్ చేస్తున్నారు. హైబ్రీడ్ మోడల్లో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతున్నాయి. భద్రతా కారణాలతో పాక్ కు వెళ్లేందుకు భారత్ అయిష్టత చూపడంతో హైబ్రీడ్ మోడల్ కు పాక్, ఐసీసీ ప్రారంభంలోనే అంగీకరించాయి. దాన్ని బట్టి ఒకవేళ భారత్ నాకౌట్, ఫైనల్ కు చేరితే ఆ మ్యాచ్ లు దుబాయ్ లోనే నిర్వహించాలని ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ముందే అనుకున్నట్లుగా లాహోర్ లో కాకుండా, ఇప్పుడు ఫ్రెష్ గా దుబాయ్ లో జరుగుతుంది. దీంతో భారత అభిమానులు పాక్ ను సోషల్ మీడయాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పోస్టులతో హాట్ హాట్ గా మారిపోయింది.
ఆస్ట్రేలియాపై భారత్ విజయంతో గడాఫీ స్టేడియం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి నాకౌట్ అయిందని ఒక నెటిజన్ చమత్కారంగా అన్నాడు.
మరొక అభిమాని అయితే టోర్నీ జరిగిన విధానం గురించి ఏకరువు పెడుతూ. తొలి సెమీస్ పాక్ అవతల జరిగిందని, ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కూడా పాక్ బయటే జరుగుతుందని ట్రోల్ చేశాడు. ఈ ఘటనతో ఆతిథ్య దేశమైనప్పటికీ, పాక్ కు బాగా లాస్ జరగడంతోపాటు చికాకుగానూ ఉంటుందని దెప్పి పొడిచాడు. ఆతిథ్య దేశం అయినప్పటికీ, కీలకమైన సెమీస్, ఫైనల్ మ్యాచ్ కు హోస్టులు కాలేక పోయారని చురకలు అంటించాడు.
మరో భారత ఫ్యాన్ పాక్ దుస్థితి గురించి డిఫరెంట్ గా ట్రోల్ చేశాడు. ఫిబ్రవరి 23న పాక్ టోర్నీ నుంచి నాకౌట్ అయిపోయిందని, మార్చి నాలుగున ఏకంగా పాక్ దేశం నుంచే చాంపియన్స్ ట్రోఫీ ఫైనలే నాకౌట్ అయిందని చమత్కరించాడు. దీన్ని బట్టి చాంపియన్స్ ట్రోఫీ పాక్ కు అందని ద్రాక్షలా మారుతోందని ట్రోల్ చేశాడు.
29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీని పాక్ నిర్వహిస్తోందని, అయితే పీసీబీ చీఫ్ మోహిసిన్ నఖ్వీ చేతగాని తనం వల్ల టోర్నీ ఫైనల్ ను కూడా పాక్ నిర్వహించలేకపోతుందని ఆ దేశ ఫ్యాన్ విచారం వ్యక్తం చేయగా.. దానికి కౌంటర్ గా నిరాశ పూరిత మైన స్థితిలో పాక్ నిలిచిందని భారత ఫ్యాన్ పోస్టు చేశాడు.
మరొక ఫ్యాన్ అయితే తన క్రియేటివిటీతో ఒక ఘజల్ లాంటిది రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పాక్ లో చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందని, కానీ పాక్ టోర్నీలో భాగంగా లేదన్నాడు. అలాగే తొలుత ఫైనల్ పాకిస్థాన్ లో జరుగుతుందని అనుకున్నా, పాక్ ఫైనల్ కు చేరలేదని చురకలు అంటించాడు. ఇప్పుడు భారత్ ఫైనల్ కు చేరడంతో టోర్నీ ఫైనలే పాక్ లో నిర్వహించకుండా అయిపోయిందని ట్రోల్ చేశాడు. ఇదేదో గమ్మత్తు పారడ్యాక్స్ లా ఉందని ట్వీట్ చేశాడు.
ఏదేమైనా ఆదివారం జరిగే ఫైనల్లో విజయం సాధించి మూడోసారి టోర్నీ సాధించిన జట్టుగా రికార్డులకెక్కాలని భారత్ భావిస్తోంది. 2002, 2013లో భారత్ టోర్నీని సాధించింది. అలాగే 2017 ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది ఇక తాజాగా ఆసీస్ పై నాలుగు వికెట్లతో గెలిచిన భారత్.. వరుసగా మూడోసారి ఫైనల్ కు చేరిన ఏకైక జట్టుగా రికార్డులకెక్కింది. 2013, 2017, 2025లో వరుసగా మూడుసార్లు టీమిండియా ఈ టోర్నీ ఫైనల్ కు చేరి అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఓవరాల్ గా భారత్ ఈ టోర్నీ ఫైనల్ కి చేరడం ఇది ఐదోసారి. రెండుసార్లు గెలిచి, మరో రెండు సార్లు ఓడిపోయింది.