Brook Trolling: బ్రూక్ ను ర్యాంగింగ్ చేస్తున్న భారత ఫ్యాన్స్.. చెన్నైలో వరుణ్ చేతిలో ఔట్ కావడంపై ట్రోలింగ్

చెన్నైలో వెదర్ క్లియర్ గా ఉందని, స్మాగ్  లేదు కదా అని బ్రూక్ కు గుర్తు చేస్తూ ఇండియన్ ఫ్యాన్స్ అతడిని టీజ్ చేస్తున్నారు. వరుణ్ బౌలింగ్లో కేవలం మూడో బంతికే ఎందుకు బౌల్డ్ అయినట్లు ప్రశ్నిస్తున్నారు.

Continues below advertisement

Ind Vs Eng T20 Series Updates: ఇంగ్లాండ్ బ్యాటర్లను భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పీడకలలా మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మిస్టరీ స్పిన్నర్ గా పేరుగాంచిన వరుణ్ ను డీకోడ్ చేయలేక వాళ్లు తంటాలు పడుతున్నారు. ఇక ఈ సిరీస్ ప్రారంభానిక ముందు ఫియర్లెస్ క్రికెట్ ఆడతామని ప్రగల్భాలు పలికిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆపసోపాలు పడుతున్నారు. ముఖ్యంగా విధ్వంసక ప్లేయర్ గా పేరు గాంచిన హారీ బ్రూక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరుణ్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కోల్ కతా టీ20 ముగిసిన తర్వాత అతను చేసిన వ్యాఖ్యలపై భారత అభిమానులు ఇప్పుడు కౌంటర్లు వేస్తున్నారు. స్మాగ్ కారణంగానే కోల్ కతాలో బంతిని సరిగ్గా చూడలేకపోయానని, లేకపోతే వరుణ్ ను ఈజీగా ఆడేవాడిని అని బ్రూక్ చెప్పుకొచ్చాడు. అయితే రెండో టీ20లో కూడా వరుణ్ కే వికెట్ సమర్పించుకోవడంపై భారత అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. 

Continues below advertisement

మూడో బంతికే..
నిజానికి చెన్నైటీ20లో బ్రూక్ మంచి టచ్ లో కనిపించాడు. ఏడు బంతుల్లోనే 13 పరుగులు చేశాడు. అయితే పవర్ ప్లే ముగిసిన తర్వాత బౌలింగ్ కు వచ్చిన వరుణ్ బౌలింగ్ లోనే తన వికెట్ సమర్పించుకున్నాడు. ఆ ఓవర్ మూడో బంతికే బ్రూక్ క్లీన్ బౌల్డయ్యాడు. బౌల్డ్ అయిన తర్వాత బ్రూక్ ముఖం చూస్తే షాక్ కు గురైనట్లు కనిపించింది. ఆ తర్వాత తను ఎలా ఔటయ్యాను అన్నట్లుగా జీవం లేని నవ్వు నవ్వి, పెవిలియన్ ముఖం పట్టాడు. ఇప్పుడు బ్రూక్ కు భారత ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. చెన్నైలో వెదర్ క్లియర్ గా ఉందని, స్మాగ్ లాంటిది లేదు కదా అని గుర్తు చేస్తున్నారు. వరుణ్ ను ఆడకుండా కేవలం మూడో బంతికే ఎందుకు బౌల్డ్ అయినట్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై ఇంగ్లాండ్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేదంటే అతిశయోక్తి కాదు. 

టీమిండియా దూకుడు..
ఇక వన్డే, టెస్టుల సంగతి ఎలా ఉన్నా, టీ20ల్లో మాత్రం భారత్ చెలరేగుతోంది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యువరక్తం అండతో ప్రత్యర్థులను వణికిస్తోంది. భారత్ అల్ట్రా ప్రో అగ్రెషన్ తో ఆడుతోందని, తాము కూడా దూకుడుగా ఆడాల్సి ఉంటుందని సిరీస్ ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వాపోయాడు. ఇంగ్లాండ్ ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడుతూ బజ్ బాల్ మంత్రం జపిస్తూ ఉంటుంది. అలాంటి ఇంగ్లాండే భారత దూకుడును చూసి బెంబేలెత్తుతోంది.

5 టీ20ల సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు జరుగగా, రెండింటిలోనూ భారతే గెలుపొందింది తొలి మ్యాచ్ లో ఏడు వికెట్లతో ఓడిన ఇంగ్లాండ్.. రెండో టీ20లో మాత్రం పోటినివ్వగలిగింది. అయినా కూడా తెలుగు కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ జోరుతో బేజారైంది. రెండు వికెట్లతో ఓటమి పాలైంది. ఇక ఇరుజట్ల మధ్య మూడో టీ20 ఈనెల 28న రాజకోట్ వేదికగా జరుగుతుంది. సిరీస్ లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 

Also Read: Siraj News: 'ఆమె నాకు చెల్లెలులాంటిది' - వర్థమాన సింగర్‌తో రిలేషన్ షిప్‌పై సిరాజ్ రిప్లై

Continues below advertisement