IND VS SL Day 3 Live Updates: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో ఆట ప్రారంభమైన 4 బంతులకే ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. 116.4 ఓవర్లలో 462 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో బంతికే మహ్మద్ సిరాజ్.. వికెట్ తీసి లంకను దెబ్బ కొట్టాడు. మరోవైపు మూడో రోజు వాతావరణం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రెండో రోజులాగే మూడో రోజు కూడా వర్షం వల్ల ఆట మాటిమాటికీ ఆగిపోయే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రోజంతా దాదాపు 83 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
రోజంతా వాన ముప్పు.. సెషన్ల వారీగా ఆక్యువెదర్ రిపోర్ట్ఆక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం గాలే మైదానంలో మూడు సెషన్లలోనూ వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు 51 శాతం వర్ష సూచన ఉండగా, 11 గంటలకు 47 శాతానికి తగ్గింది. మధ్యాహ్నం 12 గంటలకు 44 శాతం, 1 గంటకు 48 శాతంగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అత్యధికంగా 52 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఆఖరి సెషన్ లో 3 గంటలకు 45 శాతం, సాయంత్రం 5 గంటల నాటికి 34 శాతానికి తగ్గే ఛాన్స్ ఉంది. దీంతో గాలే ఇంటర్నేషనల్ స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ కు భారీ పనిభారం తప్పేలా లేదు.
ఇండియా ఇన్నింగ్స్ ముగింపు.. పడిక్కల్ 167 రన్స్ విశ్వరూపంరెండో రోజు ఆట ముగిసే సమయానికి 460/9 స్కోరుతో ఉన్న ఇండియా, మూడో రోజు ఉదయం కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే చివరి వికెట్ కోల్పోయింది. నంబర్ 3 బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లు, కేషర నువాంతకు మూడు, అషిత ఫెర్నాండో కు రెండు వికెట్లు దక్కాయి. మరోవైపు ఉదయం పిచ్ రోలర్ ను ఇండియా ఉపయోగించలేదని, పిచ్ మరింతగా దెబ్బతినాలనే ప్లాన్ తోనే అలా చేశారని సంజయ్ మంజ్రేకర్ విశ్లేషించాడు. భారీ స్కోరు బోర్డుపై ఉండటంతో మ్యాచ్ పై ఇండియా పట్టు బిగించేందుకు మార్గం సుగమం చేసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
లంక రెండు వికెట్లు డౌన్..శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంటనే మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతితో విరుచుకుపడ్డాడు. సీమ్ అవుతూ వేగంగా వచ్చిన బంతిని డిఫెన్స్ చేయబోయిన లంక ఓపెనర్ నిషాన్ మధుష్క, బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ చేతికి చిక్కాడు. దీంతో ఖాతా తెరవకుండానే మధుష్క డకౌట్ గా పెవిలియన్ చేరాడు. సిరాజ్ వేసిన ఈ దెబ్బతో లంకకు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. మరికాసేపటికే మానవ్ సుతార్.. వెటరన్ దినేశ్ చండిమాల్ (5) ను పెవిలియన్ కు పంపాడు. దీంతో 27 పరుగులకే లంక రెండు వికెట్లు కోల్పోయినట్లయ్యింది.
