India Won the Toss  and elected to bat first : 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించే కీలక మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా(Team India) కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ కీలక పాత్ర పోషిస్తుందన్న అంచనాల నేపథ్యంలో హిట్ మ్యాన్‌ టాస్ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుందని మాజీలు ఇప్పటికే అంచనా వేశారు. ఈ సమయంలో  భారత జట్టు సారధి మరో ఆలోచన లేకుండా అదే చేశాడు, బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ ఎలాంటి మార్పులు లేకుండా రోహిత్‌ సేన బరిలోకి దిగింది.






కోట్లాది మంది అభిమానుల అంచనాలను మోస్తూ  టీమిండియా టైటిల్‌ పోరుకు సిద్ధమైంది.  దక్షిణాఫ్రికా(SA)ను పడగొట్టి టైటిల్‌ ఒడిసిపట్టి...  పదేళ్ళనాటి కలను సాకారం చేసుకోవాలని రోహిత్ సేన గట్టి పట్టుదలతో ఉంది.  అయితే  రోహిత్‌ శర్మ-కోహ్లీ ఎలా ఆడతారన్న దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. విరాట్‌ మరోసారి విశ్వరూపం దాలిస్తే మాత్రం టీమిండియా గెలుపు అంత కష్టమేమీ కాదు. కీలకమైన మ్యాచుల్లో కోహ్లీలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వస్తాడు. అదే మళ్లీ జరిగితే ప్రొటీస్‌కు కష్టాలు తప్పవు.


గత లెక్కలు చూస్తే ఇప్పటివరకు ఎనిమిది టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో ఏడుసార్లు టాస్ గెలిచిన జట్టే కప్‌ను కప్ ను గెలుచుకుంది. దక్షిణాఫ్రికా, ఇండియా రెండు జట్లు ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. అంటే ఈ రోజు ఓడిపోయే జట్టుకు మొదటి ఓటమి మాత్రమే కాదు ఈ కప్ లో చివరి ఓటమి అలాగే అతి పెద్ద ఓటమి కూడా.  ఇక ప్రపంచ కప్ ను యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్  అభిమానుల కోలాహలం మధ్య స్టేడియం లోకి తీసుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డ్ లు బ్రేక్ చేస్తాడు. అదే జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. 


ఇండియా టీమ్:


రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), సూర్య కుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్


దక్షిణాఫ్రికా తుది జట్టు:


క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్‌), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, అన్రిచ్ నోకియా, తంబ్రెజ్ షంసి.