Ind Vs Sa Final Live Updates: టీ20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా, 2వసారి మెగా ట్రోఫీ కైవసం

Ind Vs Sa World Cup Final:భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌ లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Sheershika Last Updated: 30 Jun 2024 12:25 AM
ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్, చివరి టీ20 మ్యాచ్: విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ ఇదే తన చివరి టీ20 వరల్డ్ కప్ అని, చివరి టీ20 మ్యాచ్ అని సంచలన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై నెగ్గి టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచిన తరువాత కోహ్లీ మాట్లాడుతూ పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

India Lift T20 World Cup 2024: ఆఖరికి సాధించా: రోహిత్‌ శర్మ ఎమోషనల్ మోమెంట్ చూశారా?

Team India Captian Rohit Sharma Got Emotional After won T20 world cup 2024: టీ 20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన తర్వాత రోహిత్‌ శర్మ తనలో ఉన్న ఎమోషనల్‌ మొత్తాన్ని చూపించాడు. గ్రౌండ్‌లో పడుకొని నేలపై కొట్టిగా కొడుతూ మొత్తానికి సాధించా... మొదటి వరల్డ్‌కప్‌లో భాగమైన ఉన్నా... తన కేరీర్‌లో ఆడిన ఆఖరి వరల్డ్‌కప్‌ను తన సారథ్యంలోనే గెలిచానన్న ఆనందం భావోద్వేగం రోహిత్‌లో కనిపించింది. 




India Lift T20 World Cup 2024: ప్లేయర్ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ బుమ్రా, ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్‌ కోహ్లీ

Player of the Tournament Bumrah Player of the Match Kohli: టీ 20 వరల్డ్ కప్‌ లో ప్లేయర్ ఆఫ్‌ ధి టోర్నమెంట్‌ దక్కించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్‌ కోహ్లీకి వరించింది. 

India Lift T20 World Cup 2024: ఇదే నా లాస్ట్ టీ 20 వరల్డ్‌ కప్‌: కోహ్లీ  

Virat Kohli Played His Last T20 World Cup : అనుకున్నట్టే జరిగింది. ఇదే తన లాస్ట్ టీ 20 వరల్డ్ కప్‌ అని కోహ్లీ చెప్పేశాడు. న్యూ జనరేషన్ ఈ బాధ్యతలు తీసుకోవాల్సిన టైం వచ్చిందన్నారు. ఇది ఆఖరి టీ20 వరల్డ్ కప్‌ కావడంతో తాను అంత ఎమోషన్ అయ్యాను అన్నాడు విరాట్ 

India Lift T20 World Cup 2024: ఇది కదా గ్రాండ్‌ ఫేర్‌వెల్‌- రాహుల్, విరాట్, రోహిత్‌కు ఘన వీడ్కోలు!

2024 టీ 20 వరల్డ్‌కప్‌ గెలవడం చిన్న విషయం కాదు. ఇప్పుడు ఉన్న జట్టులో చాలా మంది వచ్చే టీ 20 వరల్డ్‌కప్‌ నాటికి ఉండరు వాళ్లందరికీ ఇదే గ్రాండ్‌ పేర్‌వెల్‌గా చెప్పవచ్చు. హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు ఇదే లాస్ట్ సిరీస్‌. రోహిత్‌ శర్మ, విరాట్ కొహ్లీ వచ్చే వరల్డ్ కప్‌ ఏది కూడా అదే పరిస్థితి లేదు. వీళ్లతోపాటు 35 ఏళ్లు దాటిన చాలా మంది క్రికెటర్లకు ఇదే ఆఖరి వరల్డ్ కప్. అందుకే విజయం సాధించిన తర్వాత ఎప్పుడూ తన ముఖంలో భావోద్వేగాలు రాహుల్ ద్రవిడ్ ముఖంలో కనిపించాయి. 

T20 World Cup Winner Team India: 11 ఏళ్ల తరువాత ఐసీసీ ట్రోఫీ నెగ్గిన టీమిండియా

T20 World Cup Winner Team India: 11 ఏళ్ల తరువాత భారత్ ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. చివరగా ధోనీ కెప్టెన్సీలో భారత్ 2011 వన్డే వరల్డ్ కప్ సాధించింది. తొలి టీ20 వరల్డ్ కప్ 2007లో నెగ్గిన తరువాత 17 ఏళ్లకు పొట్టి ప్రపంచ కప్‌ను భారత్ ముద్దాడింది.

India Lift T 20 World Cup 2024: టీమిండియా భావోద్వేగం... అందరి కళ్లల్లో నీళ్లు

17 ఏళ్ల తర్వాత టీ 20 ప్రపంచకప్ గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ ఒంటరిగా వెళ్లి పైకి చూస్తూ ఆఖరి ఆట ఇదే విజయం సాధించామంటూ కన్నీళ్లు తుడుచుకుంటే... కోహ్లీ రాహుల్‌ను కౌగిలించుకొని బోరుమన్నాడు..... హార్ధిక్ పాండ్యా అయితే ఆఖరి బాలు వేసిన తర్వాత నుంచి కన్నీళ్లు పెట్టుకునే ఉన్నాడు. ఇంటర్వ్యూకు రావాలని సిబ్బంది పిలిచినా తాను ఎమోషనల్‌గా ఉన్నానని కాసేపు ఆగి వస్తానని వాళ్లకు చెప్పి వచ్చాడు. 

India vs South Africa Live Score, T20 World Cup: టీ20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా, 2వసారి కప్ కైవసం

India vs South Africa Live Score, T20 World Cup: అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

India vs South Africa Live Score, T20 World Cup: సూర్య సూపర్ క్యాచ్ - డేవిడ్ మిల్లర్ ఔట్

India vs South Africa Live Score, T20 World Cup: సూర్య కుమార్ యాదవ్ పట్టిన సూపర్ క్యాచ్ కు డేవిడ్ మిల్లర్ ఔటయ్యాడు.

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 19 ఓవర్లలో స్కోర్ 161/6

India vs South Africa Live Score, T20 World Cup: 
డేవిడ్ మిల్లర్ 21, కేశవ్ మహరాజ్ 2 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి

దక్షిణాఫ్రికా గెలవాలంటే 12 బంతుల్లో 20 రన్స్ కావాలి.

దక్షిణాఫ్రికా గెలవాలంటే 12 బంతుల్లో 20 రన్స్ కావాలి. 

6వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా, బుమ్రా బూమ్ బూమ్

6వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా, బుమ్రా బూమ్ బూమ్, మాక్రో జాన్సన్ ఔట్

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 17 ఓవర్లలో స్కోర్ 155/5

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, కాగా 17 ఓవర్లలో స్కోర్ 155/5 చేసింది.
డేవిడ్ మిల్లర్ 17, మాక్రో జాన్సన్ 2 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి

India vs South Africa Live Score, T20 World Cup: బిగ్ వికెట్, హెన్రిచ్ క్లాసెన్ ను ఔట్ చేసిన పాండ్యా

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, కీలక సమయంలో హెన్రిచ్ క్లాసెన్ ను పాండ్యా ఔట్ చేశాడు. 33 బాల్స్ లో క్లాసెన్ 52 రన్స్ చేసి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 16 ఓవర్లలో స్కోర్ 151/4

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 పరుగులు చేయాల్సి ఉండగా, 16 ఓవర్లలో స్కోర్ 151/4 చేశారు.
హెన్రిచ్ క్లాసెన్ 52, డేవిడ్ మిల్లర్ 15 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 15 ఓవర్లలో స్కోర్ 147/4

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, ఉండగా 15 ఓవర్లలో స్కోర్ 147/4 వద్ద ఉన్నారు.. హెన్రిచ్ క్లాసెన్ 49, డేవిడ్ మిల్లర్ 14 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 14 ఓవర్లలో స్కోర్ 123/4

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్ కాగా,14 ఓవర్లలో స్కోర్ 123/4 చేశారు సఫారీలు
హెన్రిచ్ క్లాసెన్ 27, డేవిడ్ మిల్లర్ 14 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి

India vs South Africa Live Score, T20 World Cup: బిగ్ వికెట్, క్వింటన్ డికాక్ 39 ఔట్

India vs South Africa Live Score, T20 World Cup: బిగ్ వికెట్, క్వింటన్ డికాక్ 39 రన్స్ ను అర్షదీప్ ఔట్ చేశాడు. కీలక సమయంలో వికెట్ లభించింది.

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 12 ఓవర్లలో స్కోర్ 101/3

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, కాగా 12 ఓవర్లలో స్కోర్ 101/3 వద్ద ఉంది. క్వింటన్ డికాక్ 34, హెన్రిచ్ క్లాసెన్ 23 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 10 ఓవర్లలో స్కోర్ 81/3

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, కాగా సగం ఇన్నింగ్స్ 10 ఓవర్లలో స్కోర్ 81/3 చేశారు.
క్వింటన్ డికాక్ 28, హెన్రిచ్ క్లాసెన్ 8 పరుగులతో ఆడుతున్నారు. హార్ధిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 3వ వికెట్ కోల్పోయిన సఫారీలు, స్టబ్స్ ఔట్

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్,  3వ వికెట్ కోల్పోయిన సఫారీలు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో స్వీప్ ఆడేందుకు యత్నించిన ట్రిస్టన్ స్టబ్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 8 ఓవర్లలో స్కోర్ 62/2

India vs South Africa Live Score, T20 World Cup:  దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్రీజులో కుదురుకున్నారు. క్వింటన్ డికాక్ 28, స్టబ్స్ 24 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 7 ఓవర్లలో స్కోర్ 49/2

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్ కాగా, 7 ఓవర్లలో స్కోర్ 49/2 అయింది.
క్వింటన్ డికాక్ 21, స్టబ్స్ 18 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 7వ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 6 ఓవర్లలో స్కోర్ 42/2

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్ కాగా, పవర్ ప్లే 6 ఓవర్లలో స్కోర్ 42/2 చేసింది.
క్వింటన్ డికాక్ 20, స్టబ్స్ 12 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 6వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 5 ఓవర్లలో స్కోర్ 32/2

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 5 ఓవర్లలో స్కోర్ 32/2

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 రన్స్, 4 ఓవర్లలో స్కోర్ 22/2

India vs South Africa Live Score, T20 World Cup: క్వింటన్ డికాక్ 10, స్టబ్స్ 2 పరుగులతో ఆడుతున్నారు. బుమ్రా వేసిన 4వ ఓవర్లో 8 పరుగులు ఇచ్చాడు.

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177, 3 ఓవర్లలో స్కోర్ 14/2

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 కాగా, 3 ఓవర్లలో స్కోర్ 14/2 చేసింది. 
స్టబ్స్ 1, క్వింటన్ డికాక్ 3 పరుగులతో ఆడుతున్నారు. బుమ్రా వేసిన 3వ ఓవర్లో 3 పరుగులు ఇచ్చాడు.

India vs South Africa Live Score, T20 World Cup: రాణించిన భారత బౌలర్లు, 2 వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

India vs South Africa Live Score, T20 World Cup: రాణించిన భారత బౌలర్లు, 2 వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177, 2 ఓవర్లలో స్కోర్ 11/1

India vs South Africa Live Score, T20 World Cup: మార్ క్రమ్ 4, క్వింటన్ డికాక్ 2 పరుగులతో ఆడుతున్నారు. బుమ్రా వేసిన 2వ ఓవర్లో 5 పరుగులు ఇచ్చాడు.

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177, తొలి వికెట్ తీసిన బుమ్రా

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177 కాగా, రెండో ఓవర్లోనే ఓపెనర్ హెండ్రిక్స్ 4 ను జస్ప్రిత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177, తొలి ఓవర్లో స్కోర్ 6/0

India vs South Africa Live Score, T20 World Cup: రీజా హెండ్రిక్స్ 4, క్వింటన్ డికాక్ 1 పరుగులతో ఆడుతున్నారు. అర్షదీప్ వేసిన 1వ ఓవర్లో 6 పరుగులు ఇచ్చాడు.

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177, టీమిండియా 20 ఓవర్లలో 176/7

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టార్గెట్ 177, టీమిండియా 20  ఓవర్లలో 176/7
రవీంద్ర జడేజా 2 ఔట్, హార్దిక్ పాండ్యా 5 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 76 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. అక్షర్ పటేల్ 47 పరుగులతో జట్టును కీలక సమయంలో ఆదుకున్నాడు.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 19.4 ఓవర్లలో 174/6

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 19.4 ఓవర్లలో 174/6
శివం దుబే 27 రన్స్ చేసి క్యాచ్ ఔటయ్యాడు. 

India vs South Africa Live Score, T20 World Cup: విరాట్ కోహ్లీ 76 ఔట్ , టీమిండియా 19 ఓవర్లలో 167/5

విరాట్ కోహ్లీ 76 ఔట్ , టీమిండియా 19 ఓవర్లలో 167/5

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 18 ఓవర్లలో 150/4

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 18 ఓవర్లలో 150/4
విరాట్ కోహ్లీ 64, శివం దుబే 22 రన్స్ తో ఆడుతున్నారు. రబాడ 18వ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 17 ఓవర్లలో 134/4

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 17 ఓవర్లలో 134/4
విరాట్ కోహ్లీ 56, శివం దుబే 21 రన్స్ తో ఆడుతున్నారు. 17వ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: 48 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ

India vs South Africa Live Score, T20 World Cup: 48 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 16 ఓవర్లలో 126/4

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 16 ఓవర్లలో 126/4
విరాట్ కోహ్లీ 48, శివం దుబే 15 రన్స్ తో ఆడుతున్నారు. 16వ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 15 ఓవర్లలో 118/4

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 15 ఓవర్లలో 118/4
విరాట్ కోహ్లీ 47, శివం దుబే 9 రన్స్ తో ఆడుతున్నారు. 15వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 14 ఓవర్లలో 108/4, అక్షర్ పటేల్ రనౌట్

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 14 ఓవర్లలో 108/4
విరాట్ కోహ్లీ 44, శివం దుబే 1 రన్స్ తో ఆడుతున్నారు. 14వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: అక్షర్ పటేల్ రనౌట్, కోహ్లీ ఆన్ మిషన్

India vs South Africa Live Score, T20 World Cup: అక్షర్ పటేల్ రనౌట్, కోహ్లీ ఆన్ మిషన్


టీమిండియా 13.4 ఓవర్లలో 107/4
విరాట్ కోహ్లీ 43, అక్షర్ పటేల్ 47 రన్స్ చేసి కీపర్ డైరెక్ట్ త్రో తో రనౌట్ అయ్యాడు. 

అక్షర్ పటేల్ సిక్సర్ తో 100 మార్క్ చేరిన టీమిండియా

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 13.1 ఓవర్లలో 104/3
విరాట్ కోహ్లీ 43, అక్షర్ పటేల్ 46 రన్స్ తో ఆడుతున్నారు. 13.1వ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 13 ఓవర్లలో 98/3

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 13 ఓవర్లలో 98/3
విరాట్ కోహ్లీ 43, అక్షర్ పటేల్ 40 రన్స్ తో ఆడుతున్నారు. 13వ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 12 ఓవర్లలో 93/3

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 12 ఓవర్లలో 93/3
విరాట్ కోహ్లీ 39, అక్షర్ పటేల్ 29 రన్స్ తో ఆడుతున్నారు. 12వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 11 ఓవర్లలో 82/3

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 11 ఓవర్లలో 82/3
విరాట్ కోహ్లీ 39, అక్షర్ పటేల్ 29 రన్స్ తో ఆడుతున్నారు. జాన్సెన్ బౌలింగ్ 11వ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 10 ఓవర్లలో 75/3

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 10 ఓవర్లలో 75/3
విరాట్ కోహ్లీ 36, అక్షర్ పటేల్ 26 రన్స్ తో ఆడుతున్నారు. షంషీ బౌలింగ్ 10వ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 9 ఓవర్లలో 68/3

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 9 ఓవర్లలో 68/3
విరాట్ కోహ్లీ 31, అక్షర్ పటేల్ 25 రన్స్ తో ఆడుతున్నారు. మార్ క్రమ్ బౌలింగ్ 9వ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 8 ఓవర్లలో 59/3

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 8 ఓవర్లలో 59/3
విరాట్ కోహ్లీ 28, అక్షర్ పటేల్ 18 రన్స్ తో ఆడుతున్నారు. మార్ క్రమ్ బౌలింగ్ 8వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 7 ఓవర్లలో 49/3

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 7 ఓవర్లలో 49/3
విరాట్ కోహ్లీ 27, అక్షర్ పటేల్ 10 రన్స్ తో ఆడుతున్నారు. 7వ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 6 ఓవర్లలో 45/3

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 6 ఓవర్లలో 45/3
విరాట్ కోహ్లీ 25, అక్షర్ పటేల్ 8 రన్స్ తో ఆడుతున్నారు. 6వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 5 ఓవర్లలో 39/3

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 5 ఓవర్లలో 39/3
విరాట్ కోహ్లీ 22, అక్షర్ పటేల్ 5 రన్స్ తో ఆడుతున్నారు


 





India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 4.3 ఓవర్లలో 34/3

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 4.3 ఓవర్లలో 34/3
రబాడ బౌలింగ్ లో సూర్య కుమార్ 3 ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ 22 రన్స్ తో ఆడుతున్నాడు

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 4 ఓవర్లలో 32/2

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 4 ఓవర్లలో 32/2
విరాట్ కోహ్లీ 21, సూర్య కుమార్ 2 రన్స్ తో ఆడుతున్నారు

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 3 ఓవర్లలో 26/2

India vs South Africa Live Score, T20 World Cup: టీమిండియా 3 ఓవర్లలో 26/2 


విరాట్ కోహ్లీ 15, సూర్య కుమార్ 2 రన్స్ తో ఉన్నారు.

India vs South Africa Live Score, T20 World Cup:  ఓకే ఓవర్లో భారత్ కు డబుల్ షాక్, 2 ఓవర్లలో 23/2

India vs South Africa Live Score, T20 World Cup:  ఓకే ఓవర్లో భారత్ కు డబుల్ షాకిచ్చాడు కేశవ్ మహరాజ్. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రోహిత్ శర్మ (9), రిషబ్ పంత్ ను డకౌట్ చేశాడు. భారత్ 23/2

India vs South Africa Live Score, T20 World Cup: తొలి వికెట్ కోల్పోయిన భారత్, కెప్టెన్ రోహిత్ శర్మ (9) ఔట్

India vs South Africa Live Score, T20 World Cup:  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (9) ఔట్. భారత్ 23/1

India vs South Africa Live Score, T20 World Cup: తొలి ఓవర్లో 15 పరుగులు
తొలి ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ14 , రోహిత్ శర్మ 1తో ఉన్నారు.

 
India vs South Africa Live Score, T20 World Cup: వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న దక్షిణాఫ్రికా టీమ్ ఇదే

India vs South Africa Live Score, T20 World Cup: దక్షిణాఫ్రికా టీమ్ ఇదే: మార్ క్రమ్ (కెప్టెన్), డికాక్ (కీపర్), హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నోకియా, టి. షమ్సీ






 

WT20 2024 Team India XI: టీమిండియా ఫైనల్ ఆడుతున్న టీమ్ ఇదే

ఇండియా టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), సూర్య కుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్

India vs South Africa Live Score, T20 World Cup: వెదర్ అనుకూలంగా ఉందని దినేష్ కార్తీక్ ట్వీట్

నిన్న వర్షం పడింది, కానీ నేడు మ్యాచ్ జరగాడానికి ప్రస్తుతానికి వెదర్ అనుకూలంగా ఉందని దినేష్ కార్తీక్ ట్వీట్ చేశాడు. 


 





India vs South Africa Live Score, T20 World Cup: భారత్, సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్ పిచ్‌ రిపోర్ట్, బ్యాటర్లకు కష్టమే
India vs South Africa Live Score, T20 World Cup: వరల్డ్ కప్ ఫైనల్ జరిగే బార్బడోస్‌లో పిచ్‌ సీమర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్‌పై సీమర్లు చెలరేగితే బ్యాటర్లకు కష్టమే. పిచ్‌ మరింతగా బౌలర్లకు అనుకూలంగా మారనుంది. బంతి బ్యాట్‌పైకి వస్తుంది, కానీ కాస్త ఓపిగ్గా ఆడకపోతే స్కోర్లు కష్టమే. ఊపికతో నిలబడితే భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పిచ్ రిపోర్ట్ పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 
India vs South Africa Live Score, T20 World Cup: ఈ అయిదుగురిపైనే అందరి దృష్టి, ముంచినా వీళ్లే, మ్యాచ్ విన్నర్లు వీళ్లే

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఈ ఐదుగురు ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, క్వింటన్ డి కాక్, ఎన్రిక్ నోకియా కీలకం కానున్నారు. మ్యాచ్ జరగడానికి వాతావరణం అనుకూలిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

India vs South Africa Live Score, T20 World Cup: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక బార్బడోస్ నుంచి శుభవార్త

India vs South Africa Live Score, T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ ఫైనల్స్ జరగనున్న బార్బడోస్ లో వాతావరణం అనుకలిస్తోంది.  రెగ్యూలర్ టైంకు మ్యాచ్ ప్రారంభించడానికి వేదిక సిద్ధంగా ఉంది. ఏ జాప్యం లేకుండా మ్యాచ్ జరుగుతుందని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

India vs South Africa LIVE Toss Update: భారత్, సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్ టాస్ టైమ్ ఇదే

India vs South Africa LIVE Toss Update: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే, భారత కాలమానం ప్రకారం రాత్రి 07:30 కి టాస్ వేయనున్నారు. 

South Africa vs India T20 World Cup Final: టీ20 మ్యాచ్‌లలో ముఖాముఖీ పోరులో టీమిండియాదే ఆధిపత్యం 

IND vs SA Live Score, T20 World Cup 2024:  టీ20 మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా, భారత్ మొత్తం 26 మ్యాచ్ లలో తలపడగా మన జట్టు ఆధిపత్యం చెలాయించింది. దక్షిణాఫ్రికా, భారత్ ఆడిన టీ20 మ్యాచ్‌లు: 26


భారత్ నెగ్గినవి: 14


దక్షిణాఫ్రికా విజయాలు: 12

Rohit Sharma only Player 1St T20 World Cup and Now: టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆ ఒక్కడిగా నిలిచిన రోహిత్ శర్మ

Ind Vs Sa Final Live Updates: రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ కురువృద్ధుడు. అదేంటీ 37ఏళ్ల వయస్సుంటే కురువృద్ధుడు అయిపోతాడా అనేగా మీ డౌట్. కాదు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మనే. ఎందుకంటే 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ లో ఆడి...ఇప్పుడు 2024 లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లోనూ ఆడుతోంది రోహిత్ శర్మనే. 2007 టీ20 వరల్డ్ కప్ లో తన టీమ్ లో 20ఏళ్ల రోహిత్ శర్మను ఎంచుకున్నాడు ఎమ్మెస్ ధోని. అప్పుడు మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మ క్వార్టర్ ఫైనల్లో సౌతాఫ్రికా మీద హాఫ్ సెంచరీతో అదరగొట్టేస్తాడు. 40 బాల్స్ లో రోహిత్ శర్మ అప్పుడు కొట్టిన హాఫ్ సెంచరీనే టీమిండియాను సౌతాఫ్రికా మీద 37పరుగుల విజయం సాధించేలా చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ మీద జరిగిన ఫైనల్లోనూ హిట్ మ్యాన్ తన దైన స్టైల్ లో ఆడేస్తాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు మిడిల్ ఆర్డర్ లో  16 బాల్స్ ఆడి 30పరుగులు చేసి నాటౌట్ గా నిలుస్తాడు రోహిత్ శర్మ.


సో అప్పుడు పాకిస్థాన్ పై సంచలన విజయం సాధించి విశ్వవిజేతలుగా వరల్డ్ కప్పు అందుకున్న ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పుడు 17ఏళ్ల తర్వాత మరో టీ20 వరల్డ్ కప్ కోసం 37ఏళ్ల వయస్సులో కెప్టెన్ గా భారత్ జట్టును నడిపిస్తున్నాడు రోహిత్ శర్మ. తిరుగులేని విజయాలతో, బెదురులేని బ్యాటింగ్ తో తన జట్టును ఫైనల్ కు తీసుకువచ్చిన రోహిత్ శర్మ ఈ రోజు సౌతాఫ్రికాను చిత్తు చేసి వరల్డ్ కప్ అందుకుంటే చాలు ఎలా టీ20 వరల్డ్ కప్ తో తన కెరీర్ ప్రభంజనం మొదలైందో ఏ సౌతాఫ్రికా మీద తొలిసారి హాఫ్ సెంచరీ కొట్టాడో..ఇప్పుడు అదే సౌతాఫ్రికాను మళ్లీ చిత్తు చేసి..మళ్లీ 17ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ అందుకున్న ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.

Rohit Sharma only Player 1St T20 World Cup and Now: టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆ ఒక్కడిగా నిలిచిన రోహిత్ శర్మ

Ind Vs Sa Final Live Updates: రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ కురువృద్ధుడు. అదేంటీ 37ఏళ్ల వయస్సుంటే కురువృద్ధుడు అయిపోతాడా అనేగా మీ డౌట్. కాదు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మనే. ఎందుకంటే 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ లో ఆడి...ఇప్పుడు 2024 లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లోనూ ఆడుతోంది రోహిత్ శర్మనే. 2007 టీ20 వరల్డ్ కప్ లో తన టీమ్ లో 20ఏళ్ల రోహిత్ శర్మను ఎంచుకున్నాడు ఎమ్మెస్ ధోని. అప్పుడు మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మ క్వార్టర్ ఫైనల్లో సౌతాఫ్రికా మీద హాఫ్ సెంచరీతో అదరగొట్టేస్తాడు. 40 బాల్స్ లో రోహిత్ శర్మ అప్పుడు కొట్టిన హాఫ్ సెంచరీనే టీమిండియాను సౌతాఫ్రికా మీద 37పరుగుల విజయం సాధించేలా చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ మీద జరిగిన ఫైనల్లోనూ హిట్ మ్యాన్ తన దైన స్టైల్ లో ఆడేస్తాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు మిడిల్ ఆర్డర్ లో  16 బాల్స్ ఆడి 30పరుగులు చేసి నాటౌట్ గా నిలుస్తాడు రోహిత్ శర్మ. సో అప్పుడు పాకిస్థాన్ పై సంచలన విజయం సాధించి విశ్వవిజేతలుగా వరల్డ్ కప్పు అందుకున్న ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పుడు 17ఏళ్ల తర్వాత మరో టీ20 వరల్డ్ కప్ కోసం 37ఏళ్ల వయస్సులో కెప్టెన్ గా భారత్ జట్టును నడిపిస్తున్నాడు రోహిత్ శర్మ. తిరుగులేని విజయాలతో, బెదురులేని బ్యాటింగ్ తో తన జట్టును ఫైనల్ కు తీసుకువచ్చిన రోహిత్ శర్మ ఈ రోజు సౌతాఫ్రికాను చిత్తు చేసి వరల్డ్ కప్ అందుకుంటే చాలు ఎలా టీ20 వరల్డ్ కప్ తో తన కెరీర్ ప్రభంజనం మొదలైందో ఏ సౌతాఫ్రికా మీద తొలిసారి హాఫ్ సెంచరీ కొట్టాడో..ఇప్పుడు అదే సౌతాఫ్రికాను మళ్లీ చిత్తు చేసి..మళ్లీ 17ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ అందుకున్న ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.

Rohit Sharma In T20 World Cup 2024 Final: వరల్డ్ కప్ లో ఫైనల్ రోహిత్ శర్మ రెచ్చిపోవాలని కోరుకుంటున్న ఫ్యాన్స్

Ind Vs Sa Final Live Updates: ప్రపంచకప్ తుదిసమరానికి మరికొద్ది గంటలే సమయం ఉంది. ఇలాంటి టైమ్ లో భారత అభిమానుల అందరి కోరికా ఒకటే. కెప్టెన్ గా  హిట్ మ్యాన్ ఎలాగైనా టీమిండియాకు వరల్డ్ కప్ అందించాలని. 1983లో కపిల్ దేవ్ తొలి సారి భారత్ కు కెప్టెన్ గా వరల్డ్ కప్ ను అందిస్తే..2007లో 2011లో మహేంద్ర సింగ్ ధోని రెండు వరల్డ్ కప్ లను భారత్ కు అందించాడు. నాయకుడిగా అన్ని ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన మాహీ తర్వాత ఆ స్థాయిలో ఐసీసీ టోర్నీల నుంచి రిజల్ట్స్ రాబడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మనే.


అంతెందుకు ఆఖరి రెండేళ్లలోనే భారత్ ఐసీసీ ట్రోఫీ ఫైనల్ ఆడటం ఇది మూడోసారి. 2023 లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడిన భారత్ ఆస్ట్రేలియాకు దాన్ని కోల్పోయింది. తిరిగి 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ తిరుగులేకుండా ఫైనల్ కు దూసుకొచ్చిన భారత్ మళ్లీ ఆస్ట్రేలియా చేతిలోనే ఓటమిపాలైంది.  ఇప్పుడు ఇది రెండేళ్ల కాలంలో మూడో వరల్డ్ టోర్నీ ఫైనల్. 2024 టీ 20 వరల్డ్ కప్ లోనూ ఓటమి లేకుండా భారత్ ఫైనల్ కు దూసుకువచ్చింది.


గత రెండు సార్లు కెప్టెన్ గా టీమిండియాను ఫైనల్ కు తీసుకువెళ్లిన రోహిత్ శర్మ..ఈసారి ఎలాగైనా కప్పు అందించాలనే కసితో ఉన్నాడు. ఇంగ్లండ్ తో సెమీస్ లో గెలిచిన తర్వాత చూశాం. రోహిత్ శర్మ ఎంత ఎమోషనల్ ఫీలయ్యాడో. దానికి రీజన్ అదే. ఇంకొక్క బ్లడీ ఇంచ్ దాటితే చాలు టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన ఘనత రోహిత్ శర్మ కెరీర్ లో మిగిలిపోతుంది.


కెప్టెన్ గా తన సెల్ఫ్ లెస్ బ్యాటింగ్ తో కొన్నేళ్లుగా రోహిత్ ఎలా కీలకంగా మారాడో మనందరికీ తెలుసు. రికార్డులు పట్టించుకోకుండా వ్యక్తిగత మైల్ స్టోన్స్ గురించి ఆలోచించుకుండా హిట్ మ్యాన్ చేస్తున్న త్యాగాలకు సరైన గుర్తింపు రావాలంటే ఈ రోజు భారత్ చక్ దే ఇండియా అనాల్సిందే. విశ్వవిజేతలుగా నిలవాల్సిందే.

South Africa vs India T20 World Cup Final: ప్రపంచకప్ తుది సమరానికి భారత్, దక్షిణాఫ్రికా

 Ind Vs Sa Final Live Updates: కరీబియన్ గడ్డపై భారత్ జెండా...విశ్వవిజేతలుగా రోహిత్ సైన్యం. ఇదే ఈ రోజు అందరూ వినాలకుంటున్న చూడాలంటుకున్న విషయం. ఈ వరల్డ్ కప్ లో అప్రతిహత జైత్రయాత్రతో ఫైనల్ వరకూ దూసుకొచ్చిన టీమిండియా..విశ్వవిజేతగా మారేందుకు ఇక ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది. బలమైన సౌతాఫ్రికాను అంతకంటే బలంగా ఢీకొడితే చాలు 13సంవత్సరాల తర్వాత భారత్ చేతిలోకి ప్రపంచకప్ వచ్చి చేరుతుంది. 2007లోనే టీ20 వరల్డ్ కప్ ను మనం సాధించినా..2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత క్రికెట్ మరో వరల్డ్ కప్ ను అందుకోలేక పోయింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వరకూ దూసుకెళ్లినా ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయి ఆసీస్ కు ట్రోఫీని కోల్పోయింది. కానీ ఈసారి మాత్రం అలా కాకూడదని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. సౌతాఫ్రికా వరుస విజయాలతోనే ఇక్కడిదాకా దూసుకువచ్చిన మునుపటంత బలంగా  సఫారీ జట్టు కనిపించటం లేదు. డికాక్ ఆడటం మినహా మరో బ్యాటర్ పెద్దగా రెచ్చిపోయింది లేదు. ప్రధానంగా క్లాసెన్ లాంటి వీరబాదుడు బాదే హిట్టర్ అంత టచ్ లో లేకపోవటం మనకు కలిసొచ్చే అంశం. మన స్పిన్నర్లు, మన పేసర్లు బార్బడోస్ లో మరోసారి రెచ్చిపోతే చాలు. ఇక బ్యాటింగ్ విషయంలో మరోసారి రోహిత్ శర్మనే ఆదుకోవాలి. దానికి తోడుగా కింగ్ రెచ్చిపోతే ప్రొటీస్ కు చుక్కలు కనిపించటం ఖాయం. టాపార్డర్ లో పంత్, సూర్య...మిడిల్ ఆర్డలో పాండ్యా తమ ఫామ్ ను కొనసాగిస్తే చాలు. అయితే దూబేనే ఉంటాడా ఎవరూ ఊహించని విధంగా సంజూనూ ఏమన్నా ట్రై చేస్తారా చూడాలి. మొత్తంగా ఈ ఒక్క మ్యాచ్ భారత్ తన ఆధిపత్యం ప్రదర్శిస్తే చాలు ప్రపంచకప్ భారత్ చేతిలోకి వచ్చేస్తుంది. టీమిండియా విశ్వవిజేతలుగా నిలుస్తుంది.

Background

T20 World Cup 2024 Final: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఈ జట్లు తలపడతాయని చాలా మంది అనుకుని ఉండరు. భారత్, సౌతాఫ్రికా రెండు జట్లు కూడా ఓటమి లేకుండా ఈ ఫైనల్ వరకూ దూసుకువచ్చాయి. సౌతాఫ్రికా ఓ ఐసీసీ ఈవెంట్ ఫైనల్ ఆడుతుండటం ఇదే మొదటిసారి కాగా...భారత్ కు ఐసీసీ ఈవెంట్స్ లో ఫైనల్ ఆడటం ఇది 13వసారి.  


ఆస్ట్రేలియా పేరు మీద మాత్రమే ఇన్నాళ్లూ ఉన్న ఈ అత్యధిక ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ రికార్డు భారత్ నిన్న ఇంగ్లండ్ పై విజయంతో సమం చేసింది. అయితే టీ20 వరల్డ్ కప్పును భారత్ గెలిచింది కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా 2007లో. టీ2౦ వరల్డ్ కప్ ను మొదలు పెట్టిన ఆ ఏడాదే ఫస్ట్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. మహేంద్ర సింగ్ ధోని అనే కెప్టెన్ భారత్ కోసం పుట్టుకొచ్చింది అక్కడి నుంచే. ఆ తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడూ భారత్ మరో కప్పును ముద్దాడలేదు.


2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన...2023 వన్డే వరల్డ్ కప్ ను ఫైనల్లో ఆస్ట్రేలియాకు కోల్పోయింది. తిరిగి ఏడాది గ్యాప్ లో ఇప్పుడు మరో ఐసీసీ ఈవెంట్ లో ఫైనల్ కు చేరుకోవటం ద్వారా భారత్ ఈసారైనా ట్రోఫీ అందుకోవాలనే కసితో ఉంది. ధోని తర్వాత టీ20ల్లో వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ ఘనత సాధించాలని  ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అయితే సౌతాఫ్రికాను తక్కువ అంచనా వేయలేం. ఆ టీమ్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సార్లు సెమీస్ గండాన్ని దాటలేకపోయింది.


చోక్ అయిపోవటమే...ఎక్కడ లేని దురదృష్టం వెంటాడమో ఇన్నేళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న సౌతాఫ్రికా తొలిసారి ఓ ఐసీసీ ఈవెంట్ ఫైనల్ ఆడుతోంది. సో మనకంటే సౌతాఫ్రికా మరింత పట్టుదలతో సౌతాఫ్రికా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఓపెనర్ డికాక్, మార్ క్రమ్, క్లాసెన్ లాంటి బ్యాటర్లు రబాడా, మార్కో జాన్సన్, షంసీ, కేశవ్ మహరాజ్ లాంటి బౌలర్లే ఆయుధంగా సౌతాఫ్రికా తమ శక్తి మేర భారత్ ను ఢీ కొట్టడం ఖాయం. మరి ఈ రెండు కొదమసింహాల్లో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే శనివారం రాత్రి 8 గంటలకు బార్బడోస్ లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.