India vs South Africa 2nd Test Day 1 Highlights:పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై సీమర్లు నిప్పులు చెరిగిన వేళ.. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న కీలకమైన రెండో టెస్ట్‌ (IND vs SA 2nd Test)లో తొలిరోజే 23 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్లు చెత్త రికార్డులు నమోదు చేసిన మ్యాచ్‌లో ప్రస్తుతం భారత్‌ (Team India).. స్వల్ప పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత 55 పరుగులకే కుప్పకూలింది. 

 

నిప్పులు చెరిగిన సిరాజ్‌

కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj).. కెరీర్‌లోనే అద్భుత స్పెల్‌తో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. సిరాజ్‌ మియా నిప్పులు చెరిగే బంతులకు ప్రొటీస్‌ బౌలర్ల వద్ద సమాధానమే కరువైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే సిరాజ్ షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ మాక్రమ్‌ను 2 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చిన మాక్రమ్ ఔటయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన సిరాజ్ సౌతాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ను 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా 18 ఓవర్లకు 45 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ను బుమ్రా.. కేశవ్‌ మహరాజ్‌ను ముఖేష్‌కుమార్‌ అవుట్‌ చేశారు. దీంతో 50 పరుగులకే సఫారీలు ఎనిమిది వికెట్లు కోల్పోయారు. అనంతరం బుమ్రా, ముఖేష్‌ చెరో వికెట్‌ తీయడంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ల ధాటికి ప్రొటీస్‌ 55 పరుగులకే కుప్పకూలడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. 

 

భారత్‌కు 98 పరుగుల ఆధిక్యం

అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించే అవకాశాన్ని భారత్‌ చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకే ఆలౌటైంది. టీ విరామ సమయానికి 111 పరుగులకు 4 వికెట్లతో పటిష్టంగా కనిపించిన టీమిండియా 153 పరుగులకే కుప్పకూలింది. టీమ్‌ఇండియా(Team India) చివరి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్‌ప్రీత్‌ బుమ్రా (0) లను పెవిలియన్‌కు పంపాడు. 153 పరుగుల వద్ద అయిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌... అదే స్కోరు వద్ద ఆలౌట్‌ అయింది.  టీమిండియా చివరి ఆరు వికెట్లను ఒకే స్కోర్‌ వద్ద కోల్పోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. . టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ జట్టు పరుగులేమీ చేయకుండా చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ అపఖ్యాతిని టీమిండియా మూటగట్టుగుంది. ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌ తర్వాత 153కు నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా... అదే 153 పరుగుల వద్ద 153 ఆలౌట్‌ అయింది. టీమిండియా 98 పరుగుల ఆధిక్యం సాధించింది. 

 

అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 62 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ప్రొటీస్‌ ఇంకా 36 పరుగులు వెనకపడి ఉంది. రేపు తొలి సెషన్‌లో దక్షిణాఫ్రికాను త్వరగా ఆలౌట్‌ చేస్తే భారత్‌ విజయం ఖాయమే.