IND vs PAK: దాయాది పాకిస్తాన్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో జస్ప్రిత్ బుమ్రా గేమ్ ఛేంజర్ అని ఇయాన్ మోర్గాన్ అభిప్రాయపడ్డారు. ఈ‌ ప్రపంచ కప్‌లో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడని, ఇందుకు గత రెండు మ్యాచ్ ఫలితాలే నిదర్శనం అన్నారు. 13.71 సగటుతో బూమ్రా ఆరు వికెట్లు తీయడంతో పాటు ఆకట్టుకునే ప్రదర్శన చేశాడని ప్రశంసించారు. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన రెండవ ఆటగాడిగా బూమ్ర నిలిచాడు.


ఆఫ్ఘానిస్తాన్‌పై బూమ్రా అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 39 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ కప్ ప్రదర్శనల్లో బూమ్రా అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్‌ను 8 వికెట్లకు 272 పరుగులకు భారత్ పరిమితం చేయడంలో సహాయపడింది. ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ విజయం అందుకోవడానికి దోహదపడింది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ టోర్నీలో పేసర్లలో బుమ్రా 3.7 అత్యుత్తమ ఎకానమీ-రేట్‌ను కలిగి ఉన్నాడు. 


ఈ నేపథ్యంలో ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత బౌలింగ్ బలంగా, ఫామ్‌లో ఉందన్నారు. వివిధ దశల్లో ఆటలో ఒత్తిడిని పెంచడం, వికెట్లు తీయడం ఎలాగో బూమ్రాకు తెలుసునని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ప్రశంసించాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌తో పోలిస్తే భారత బౌలింగ్ లైనప్‌లో బ్యాలెన్స్ మెరుగ్గా ఉందని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. సరైన సమయంలో బూమ్రాను జట్టులోకి తీసుకురావడంతో భారత బౌలింగ్ లైనప్ మరింత బలంగా మారిందన్నాడు. దాదాపు నాలుగు లేదా ఐదు నెలల క్రితం, బూమ్రా డబ్లిన్‌లో ఆడినప్పుడు బూమ్రా తిరిగి తన ఫామ్‌లోకి వచ్చాడని, అదే ప్రపంచ కప్‌ వైపు దృష్టి సారించేలా చేసిందని మోర్గాన్ అభిప్రాయపడ్డారు. 


బూమ్రా గేమ్ ఛేంజర్, ఆఫ్ఘనిస్తాన్‌పై ఒత్తిడి పెంచడం, వివిధ దశల్లో నాలుగు వికెట్లు తీయశాడని, బూమ్రా రెండు వైపులా గేమ్ ఛేంజర్ అని అనుకుంటున్నాట్లు చెప్పారు. పాకిస్తాన్ బౌలింగ్ లైనప్‌కు వ్యతిరేకంగా ఏమీ లేదని, భారత లైనప్, బ్యాలెన్స్ గురిం చెబుతున్నానని అన్నారు. జడేజా, కుల్దీప్, శార్దూల్ ఠాకూర్ తిరిగి రావడం భారత్‌కు అదనపు బలమని, హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ చేయగలడని అభిప్రాయపడ్డారు. పాక్‌తో మ్యాచ్‌లో భారత్ ఉత్తమ బౌలింగ్ చేయడం కీలకమని మోర్గాన్ అన్నాడు.


గిల్ ఆడడంపై స్పష్టత
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శుభమాన్ గిల్ ఆడడంపై  టీమిండియా సారధి రోహిత్‌ శర్మ స్పష్టత ఇచ్చాడు.  శుబ్‌మన్‌ గిల్‌ 99 శాతం మ్యాచ్‌కు అందుబాటులోనే ఉంటాడన్న రోహిత్‌... కానీ తుది నిర్ణయం మ్యాచ్‌కు ముందే తీసుకుంటామని తెలిపాడు. శుభ్‌మన్ గిల్ పునరాగమనంతో టీమిండియా బ్యాటింగ్‌ బలం పెరుగుతుందన్న రోహిత్‌... గిల్‌ ఇప్పటికే బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నాడని తెలిపాడు. నెట్స్‌లో సుమారు గంటసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అప్పటి నుంచి టీమ్ ఇండియా అభిమానుల్లో గిల్‌ రాకపై అంచనాలు పెరిగాయి. శుభ్‌మన్‌ గిల్‌ రాక ఖాయమైతే ఇషాన్‌పై వేటు పడటం కూడా ఖాయమే అనిపిస్తోంది.


నేడు ప్రపంచకప్‌లో..
మ్యాచ్ ఎవరెవరికి: భారత్ వర్సెస్ పాకిస్తాన్
ఎక్కడ జరుగుతుంది: అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం
ఎప్పుడు జరుగుతుంది: శనివారం మధ్యాహ్నం 2 గంటలకు
ఎలా చూడాలి: స్టార్ స్పోర్స్ట్ నెట్ వర్క్‌లో చూడొచ్చు. మొబైల్‌లో హాట్ స్టార్ యాప్‌లో ఉచితంగా వీక్షించొచ్చు. స్మార్ట్ టీవీల్లో హాట్‌స్టార్‌లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ ఉండాలి.