India vs Pakistan Champions Trophy 2025 Live Updates: హై వోల్టేజీ మ్యాచ్ లో టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలుపుపై కన్నేసింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే దాదాపుగా సెమీస్ కు భారత్ చేరుకుంటుంది. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన పాక్.. ఈ మ్యాచ్ ఓడిపోతే టోర్నీ నుంచే నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఒక్క మార్పు కూడా చేయలేదు. బంగ్లాపై దిగిన జట్టుతోనే బరిలోకి దిగింది. అలాగే పాక్ కూడా ఒక మార్పు చేసింది. గాయపడిన ఫఖార్ జమాన్ స్థానంలో ఇమాముల్ హక్ ను జట్టులోకి తీసుకుంది. గ్రూపు-బిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 25వేల మంది సామర్థ్యంతో కూడిన ఈ స్టేడియం టికెట్లు పూర్తిగా అమ్ముడుపోగా, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది టీవీల్లో ఈ మ్యాచ్ ను చూడనున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 6 వికెట్లతో నెగ్గిన టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ జోరును కొనసాగించడంతోపాటు 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోవడం ద్వారా ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్ గా రోహిత్ రికార్డులకెక్కాడు.
ఇండియాకు ప్లస్ పాయింట్..హైబ్రీడ్ మోడల్లో భాగంగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయలో జరుగుతున్నాయి. ఇప్పటికే బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో ఆడి ఉండటం ఇండియాకు ప్లస్ పాయింట్. ఈ పిచ్ పై ఎలా ఆడాలో అవగాహన ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు రంగాల్లోనూ భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇక 2017 మెగాటోర్నీ ఫైనల్ తర్వాత పాక్ తో ఆడిన అన్ని వన్డేల్లోనూ భారత్ అన్ బీటెన్ గా ఉంది. నాలిగింటిలో గెలుపొందగా, ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు. ఇదే జోరును ఆదివారం కూడా కొనసాగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
ఒత్తిడిలో పాక్..ఇప్పటికే తొలి మ్యాచ్ లో కివీస్ చేతిలో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాక్.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని బరిలోకి దిగుతోంది. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ సాధారణంగా కనిపిస్తుండగా, బౌలింగ్ తేలిపోతోంది. ఫీల్డింగ్ లోనూ రాణించలేక పోతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని పాక్ ప్రధాని ఆటగాళ్లను కోరడం వాళ్లను ఇంకా ఒత్తిడిలోకి నెడుతోంది. ఏదేమైనా ఈ మ్యాచ్ లో ఓడిపోతే, ఆతిథ్యమిస్తూ, ఐసీసీ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాక్ చెత్త రికార్డు మూటగట్టుకుంటుంది.
Read Also: Kohli Records: ఈ రికార్డులపై కోహ్లీ గురి.. నేడు పాక్ తో భారత్ పోరు.. ఊరిస్తున్న 2 రికార్డులు