India Vs New Zealand 1st Test Highlights: బెంగళూరు: తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమైన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో మంచి కమ్ బ్యాక్ ఇచ్చినట్లు కనిపించినా అది సరిపోలేదు. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ (150 పరుగులు; 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లు) కెరీర్ లో తొలి అంతర్జాతీయ శతకం సాధించాడు. అది కూడా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో చేయడం విశేషం. మరో ఎండ్ లో దూకుడుగా ఆడినా తృటిలో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు రిషబ్ పంత్. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బంతిని లోపలికి ఆడుకోవడంతో ఇన్ సైడ్ ఎడ్జ్ అయి ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు పంత్. 


మరో ఇద్దరు రాణించింటే..
సర్ఫరాజ్ ఖాన్ భారీ శతకానికి రిషబ్ పంత్ ధనాదన్ ఇన్నింగ్స్ తోడైంది. కానీ వీరి వికెట్లు కోల్పోయిన వెంటనే భారత్ తక్కువ సమయానికి ఆలైటైంది. మరో ఇద్దరు బ్యాటర్లు కేఎల్ రాహుల్ గానీ, లేక రవీంద్ర జడేజానో లేక అశ్వినో క్రీజులో నిలిచి మరికొన్ని పరుగులు చేసింటే భారత బౌలర్లకు కాస్త వీలు చిక్కేది. దాదాపు రోజు మొత్తం ఆడిన సర్ఫరాజ్, పంత్ ఔట్ రావడంతో భారత్ వేగంగా వికెట్లు కోల్పోయి కొత్త బంతిని ఎదుర్కోలేక ఆలౌటైంది. 550 చేస్తుందా అనేలా ఆడినా చివరికి 462 పరుగులకు ఆలౌట్‌ అయింది. 


కొంపముంచిన కొత్త బంతి
కొత్త బంతి ఆందుకున్నాక కివీస్‌ పేసర్లు విలియమ్‌ ఒరోర్క్‌, మ్యాట్‌ హెన్రీ చెలరేగిపోయారు. మ్యాట్‌ హెన్రీ (3/102), విలియమ్‌ ఒరోర్క్‌ (3/92) బౌలింగ్ ధాటికి భారత జట్టు 54 పరుగుల తేడాలో చివరి 7 వికెట్లు కోల్పోయింది. ప్రత్యర్థి కివీస్ విజయానికి 107 పరుగుల స్వల్ప లక్ష్యం ఇచ్చింది టీమిండియా. అయితే భారత బౌలర్లు ఏమైనా సంచలనం చేస్తారా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలే ఒకరోజు ఆట మిగిలి ఉండటంతో కివీస్ బ్యాటర్లకు ఇది పెద్ద కష్టమైన స్కోరు కాదు. కానీ బెంగళూరు పిచ్ నాలుగో ఇన్నింగ్స్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మరోవైపు వాతావరణం అనుకూలిస్తుందా, వర్షంతో మ్యాచ్ అవాంతరం తలెత్తే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ చెబుతోంది. 


ఆకాశం కరుణిస్తుందా?
వర్షం కారణంగా తొలిరోజు బంతి పడకూడా పడలేదు. ఆ తరువాత సైతం వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించాడు. అయితే ఆకాశం మేఘావృతమై ఉండటంతో మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. కానీ చిన్న లక్ష్యమే కావడంతో కివీస్ బ్యాటర్లు దూకుడుగా ఆడి విజయం సాధిస్తారా, లేక వరుణుడి దెబ్బకు మైదానం ముద్దగా మారి మ్యాచ్ నిర్వహణ జరుగుతుందా అని క్యూరేటర్లు సైతం యోచిస్తున్నారు. భారత్ ఓడిపోవద్దంటే ఉన్నవి రెండే మార్గాలు. ఒకటి మ్యాచ్ జరిగి భారత స్పిన్నర్లు ఊహించని రీతిలో రాణించి కివీస్ జట్టును ఆలౌట్ చేయాలి. రెండోది.. పదే పదే వర్షం అంతరాయం కలిగిస్తే మ్యాచ్ నిర్వహణ సాధ్యంకాక డ్రా కావడం అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Sarfaraz Khan Century: సర్ఫరాజ్ ఖాన్ అద్భుత శతకం, తొలి టెస్ట్ సెంచరీతో సత్తా చాటిన భారత బ్యాటర్


వెలుతురు సరిగా లేని కారణంగా అంపైర్లు నాలుగో రోజు ఆటను ముందే ఆపేశారు. కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ కూడా ఆడలేదు. కేవలం 4 బంతులే పడ్డాయి. కివీస్ ఓపెనర్లు టామ్ లేథమ్‌ (0), డేవాన్ కాన్వే (0) క్రీజులో ఉన్నారు. గతంలో 2004-05 ముంబయిలో జరిగిన టెస్టులో భారత్ ఆస్ట్రేలియాకు 107 పరుగుల టార్గెట్ ఇచ్చింది. అయితే బౌలర్లు సత్తాచాటడంతో ఆసీస్ 93 పరుగులకే ఆలౌట్‌ అయింది.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌- 46
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 402
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌- 462