India vs Nepal:
ఆసియాకప్ -2023లో టీమ్‌ఇండియా రెండో మ్యాచుకు సిద్ధమైంది. పసికూన నేపాల్‌తో పల్లెకెలె వేదికగా తలపడుతోంది. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీని వెనక ప్రత్యేక కారణాలేమీ లేవన్నాడు.
'మేం మొదట బౌలింగ్ చేస్తాం. ఇందుకు ప్రత్యేక కారణాలేమీ లేవు. చివరి మ్యాచులో మేం తొలుత బ్యాటింగ్ చేశాం. ఇప్పుడు బౌలర్లు ఏం చేయగలరో చూస్తాం. వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. బౌలర్ల ఖాతాలో ఒక మ్యాచ్ ఉండాలని మేం కోరుకుంటున్నాం. చివరి మ్యాచులో మేం ఒత్తిడికి గురయ్యాం. హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడారు. ఇషాన్ ఎంతో పరిణతి ప్రదర్శించాడు. ఆటను మా వైపు తిప్పాడు. ఇది మాకు శుభసూచకం. నేపాల్ మ్యాచ్ మాకు కీలకం. ఒక మార్పు చేశాం. బుమ్రా అందుబాటులో లేడు. షమీ వచ్చాడు' అని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
'వాతావరణం చల్లగా ఉండటం, ఆకాశంలో మబ్బులు ఉండటంతో మేమూ టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకోవాలని అనుకున్నాం. నేపాల్ క్రికెట్‌కు ఇది అతిపెద్ద రోజు. ఇది మాకో గొప్ప అవకాశం. జట్టులో ఒక మార్పు చేశాం. ఆరిఫ్ షేక్ స్థానంలో భీమ్ షాక్రి వచ్చాడు' అని నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ అన్నాడు.
పిచ్ రిపోర్టు
'ఇదే పిచ్‌లో చివరి మ్యాచులో భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. వికెట్ మొత్తంగా ఫ్లాట్‌గా అనిపిస్తోంది. ఎరౌండ్ ది వికెట్ తీసుకున్నప్పుడు కాస్త ఎత్తుగా కనిపిస్తోంది. అందుకే పేసర్లకు వైవిధ్యమైన బౌన్స్ లభిస్తోంది. స్పిన్నర్లూ ప్రభావం చూపించగలరు. పిచ్ బాగుంది. పైగా మదకొడిగా ఉంది. కుల్‌దీప్ లాంటి స్పిన్నర్లు బంతితో బౌన్స్ రాబట్టి ఎక్కువగా టర్న్ చేయగలరు' అని సంజయ్ మంజ్రేకర్, మాథ్యూ హెడేన్ అన్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షహి, మహ్మద్ సిరాజ్
నేపాల్ జట్టు: కుశాల్ భూర్తెల్, ఆసిఫ్ షేక్, రోహిత్ పౌడెల్, భీమ్ షక్రి, సోంపాల్ కామి, గుల్షన్ ఝా, దీపేంద్ర సింగ్, కుశాల్ మల్లా, సందీప్ లామిచాన్, కరన్ కేసీ, లలిత్ రాజ్‌భాన్షి
నేపాల్‌కు ఇదే తొలి మ్యాచ్..
అంతర్జాతీయ స్థాయిలో నేపాలీలతో టీమ్ఇండియాకు ఇదే తొలి వన్డే. 2018లో వన్డే హోదా పొందిన నేపాల్.. ఇప్పటివరకూ అగ్రశ్రేణి క్రికెట్ జట్లతో క్రికెట్ ఆడలేదు. ఈ టోర్నీలోనే తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆడిన నేపాల్.. ఇప్పుడు భారత్‌తో తలపడనున్నది. వర్షం లేకుండా మ్యాచ్ సజావుగా సాగితే నేపాల్‌కు నేటి మ్యాచ్ ఒక మంచి మెమొరీగా మలుచుకునే అవకాశం లేకపోలేదు. పాక్‌తో తొలి మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో ఓడిన నేపాల్.. నేటి మ్యాచ్‌లో సంచలనాలు నమోదు చేయాలన్నా వరుణుడి చేతిలోనే ఉంది.
Also Read: రాహుల్ వద్దు ఇషానే ముద్దు - స్టార్లు ముఖ్యం కాదంటున్న గంభీర్