India vs England 2024, 2nd Test Match Preview: 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌ (India), ఇంగ్లాండ్‌ (England)మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి విశాఖపట్నం వేదికగా జరగనుంది. తొలిటెస్టులో ఓటమి చవిచూసిన టీమిండియా రెండో టెస్టులో ఎలాగైనా పుంజుకుని విజయాల బాటపట్టాలని కోరుకుంటోంది. గాయాల కారణంగా KL రాహుల్‌(KL Rahul), రవీంద్ర జడేజా(ravindra jadeja) భారత జట్టుకు దూరమయ్యారు. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లాండ్‌ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. 



5 టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌  తొలిటెస్టులో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి పాలైన  భారత జట్టు విశాఖపట్నం(Visakhapatnam) వేదికగా జరిగే రెండో టెస్టు కోసం సిద్ధమైంది. తొలిటెస్టులో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న టీమిండియాకు గాయాల సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు గాయాల కారణంగా KL రాహుల్‌, రవీంద్ర జడేజా దూరమయ్యారు. మూడేళ్ల క్రితం కూడా చెన్నైలో ఇంగ్లాండ్‌ చేతిలో తొలిటెస్టు ఓడిన టీమిండియా ఆ తర్వాత విజయాల బాటపట్టి టెస్టు సిరీస్‌ సొంతం చేసుకుంది. ఐతే ఈసారి జోరూట్‌ సేన నుంచి రోహిత్‌ సేన గట్టి పోటీ ఎదుర్కొంటోంది. 


టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మొదటి ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగుల అధిక్యం సాధించి కూడా టీమిండియా ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. విదేశాల్లో కలుపుకున్నా ఇది మూడోసారి మాత్రమే. 2015లో గాలె టెస్టులో శ్రీలంకపై మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 192 పరుగుల అధిక్యం సాధించింది. అయినా ఆ మ్యాచ్‌లో భారత జట్టు 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2022లో బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌‌తో జరిగిన టెస్టులో కూడా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 132 పరుగుల అధిక్యం సాధించింది. అయినా ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 

శుభమన్‌ గిల్‌ పేలవమైన ఫామ్‌ భారత జట్టును కలవరపెడుతోంది. మూడో టెస్టుకు విరాట్‌ కోహ్లీ జట్టులోకి తిరిగి రానున్న వేళ గిల్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌పై కూడా ఒత్తిడి నెలకొంది. KL రాహుల్‌ స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న రజిత్‌ పటీదార్‌ లేదా సర్ఫరాజ్‌ ఖాన్‌(Sarfaraz Khan) తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా స్థానంలో కులదీప్‌ యాదవ్‌ తుదిజట్టులోకి రానున్నాడు. ఒకే ఒక పేస్‌ బౌలర్‌తో బరిలోకి దిగాలని భారత జట్టు భావిస్తే సిరాజ్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు తుదిజట్టులో స్థానం లభించవచ్చు. 

మరో నాలుగు వికెట్లు తీస్తే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అశ్విన్‌ చేరుకోనున్నాడు. ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీని ఎదుర్కొనేందుకు తొలిటెస్టులో భారత బ్యాటర్లు తడబడ్డారు. హైదరాబాద్‌లో శతకంతో రాణించిన ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ మరోసారి సత్తా చాటాలని కోరుకుంటున్నాడు. వైజాగ్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లాండ్‌ తుది జట్టును ఇప్పటికే ప్రకటించింది.  ఇంగ్లాండ్జ ట్టులో 2 మార్పులు చోటు చేసుకున్నాయి. గాయపడిన జాక్ లీచ్ స్థానంలో కొత్త స్పిన్నర్ షోయబ్ బషీర్ను తీసుకున్నారు.  ఇక మార్క్ వుడ్ స్థానంలో వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) జట్టులోకి వచ్చాడు. గాయపడిన జాక్ లీచ్ స్థానంలో కొత్త స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను తీసుకున్నారు. ఇక మార్క్ వుడ్ స్థానంలో వెటరన్ బౌలర్‌ జేమ్స్ అండర్సన్ జట్టులోకి వచ్చాడు. భారత్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన జిమ్మీ 34 వికెట్లు పడగొట్టాడు.  మ్యాచ్‌ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నరకు ఆరంభంకానుంది.