IND vs ENG Uppal Test: హైదరాబాద్‌ ఉప్పల్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌ రసవత్తరంగా మారుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్‌ త్రయం అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని ఓలిపోప్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజులో వికెట్ల మధ్య అడ్డుగోడగా నిలబడ్డ పోప్‌... 208 బంతుల్లో 17 ఫోర్లతో 148 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లాండ్‌ (England) బ్యాటర్లలో ఓలిపోప్‌ ఒక్కడే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 77 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పోప్‌తో పాటు రిహాన్‌ అహ్మద్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇప్పటికే 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు నాలుగో రోజు  ఆట కీలకంగా మారనుంది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లను ఎంత త్వరగా అవుట్‌ చేస్తే భారత్‌ లక్ష్యం అంత తేలిక కానుంది.

మరో 15 పరుగులే...

 తొలి టెస్ట్‌లో టీమిండియా(Team India) తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 436 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ 421/7 స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ కాసేపటికే మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్‌గా కాగా...... మన ఆధిక్యం 190గా ఉంది. బ్యాటింగ్‌లో జడేజా (87), కేఎల్‌ (86) జైస్వాల్‌ (80) అర్థ సెంచరీలతో రాణించారు . అక్షర్‌ (44), భరత్‌ (41) అర్ధశతకాలు చేజార్చుకున్నారు. రోహిత్‌ (24), గిల్‌ (23), అయ్యర్‌ (35) ఫర్వాలేదనిపించగా.. అశ్విన్‌ (1), బుమ్రా (0) నిరాశపరిచారు. సిరాజ్‌ నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రూట్‌ నాలుగు, హార్ట్‌లీ రెండు వికెట్లు తీశారు.

రెండో ఇన్నింగ్స్‌లో నిలబడ్డ పోప్‌

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు పట్టుదల ప్రదర్శించారు. ఓపెనర్లు 49 పరుగులు సాధించారు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ క్రాలీ 31 పరుగులు చేసి అవుటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన ఓలి హోప్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా  హోప్‌ అడ్డుగోడ నిలబడ్డాడు. అనంతరం ఓపెనర్‌ మరో ఓపెనర్‌ డకెట్‌ 47 కూడా పరుగులు చేసి అవుటయ్యాడు.  బుమ్రా బౌలింగ్‌లో రూట్‌ రెండు పరుగులు, స్టోక్స్‌ ఆరు పరుగులకు వెంటవెంటనే అవుట్‌ కావడంతో ఇంగ్లాండ్‌ పతనం వేగంగా సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఓలీపోప్‌ అద్భుతంగా ఆడాడు. పోప్‌ 154 బంతుల్లో సెంచరీ సాధించిన పోప్‌.. ఆ తర్వాత కూడా పట్టుదలగా బ్యాటింగ్‌ చేశాడు. పోప్‌... 208 బంతుల్లో 17 ఫోర్లతో 148 పరుగులతో అజేయంగా నిలిచాడు.