అఫ్గాన్ తో జరుగుతున్న మూడు మ్యాచుల టీ 20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. ఆఫ్ఘనిస్తాన్‌ను 5 వికెట్ల నష్టానికి 158 పరుగులకు పరిమితం చేసారు. అక్షర్ పటేల్ తో పాటూ ముఖేష్ చెరో 2 వికెట్లు తీసి రాణించారు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 50 పరుగుయా భాగస్వామ్యం అందించారు.. ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. అదే స్కోర్ వద్ద మరో ఓపెనర్ ను శివమ్ దూబే పెవిలియన్ కు పంపాడు. దీనితో 50 పరుగుల వద్ద అఫ్గాన్ 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఓంరజాయ్ 22 బంతుల్లో 29 పరుగులు, మహ్మద్ నబీ 27 బంతుల్లో 42 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మిగిలిన బ్యాటర్లు ఎవరు పెద్దగా రాణించలేదు. టీం ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
మూడు మ్యాచుల టీ 20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా(Team India).. అఫ్గాన్(Afghanistan)ను బ్యాటింగ్‌కు అహ్వానించింది. పంజాబ్(Punjab) లోని మొహాలీ(mohali) వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్ బరిలోకి దిగింది. 14 నెలల తర్వాత పొట్టి క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ(Rohit Sharma) తిరిగి ఈ ఫార్మాట్‌లో సారథ్య బాధ్యతలు చేపట్టనుండటంతో ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారింది. మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ తీసుకుంది.