India Likely Playing XI Second T20I Zimbabwe:  జింబాబ్వేతో త్రీ-మ్యాచుల టి20 సిరీస్ లోని సెకండ్ మ్యాచ్ శనివారం హరారే వేదికగా జరగనుంది. ఫస్ట్ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విన్ అయిన ఇండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను క్లిన్ స్వీప్ చేయాలని ప్లాన్ చేస్తోంది. 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ టి20 లో విధ్వంసకర హాఫ్ సెంచరీ బాది మెరవగా, బౌలింగ్ లో మ‌యాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ త‌లో రెండు వికెట్లు తీసి రన్స్ కంట్రోల్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ కేవలం 1 రన్ కే అవుట్ అయి డిసప్పాయింట్ చేయడంతో సెకండ్ మ్యాచ్ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ ఓపెనర్ స్పాట్ పై టఫ్ డెసిషన్ తీసుకోనుంది.

Continues below advertisement

Read Also: Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!

లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కు మొగ్గు.. అభిషేక్ ప్లేస్ లో ప్రభ్‌సిమ్రాన్ ఎంట్రీ!!వైభవ్ సూర్యవంశీ ఓపెనర్ గా కంటిన్యూ కానుండగా, అభిషేక్ శర్మ ప్లేస్ లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ను టీమ్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువగా ఉన్న ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ రాకతో పర్ఫెక్ట్ లెఫ్ట్-రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ కుదురుతుందని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. నంబర్ 3 లో ఇషాన్ కిషన్, నంబర్ 4 లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కొనసాగించనున్నారు. వీళ్లిద్దరూ ఫస్ట్ మ్యాచ్ లో మంచి స్టార్ట్ సాధించినందున ఈసారి బిగ్ స్కోర్లు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

Continues below advertisement

Read Also: Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్! 

మిడిల్ ఆర్డర్ లో రోస్టర్ స్టార్స్.. ఫైవ్ బౌలర్ల స్ట్రాటజీ కంటిన్యూమిడిల్ ఆర్డర్ ను స్ట్రాంగ్ చేయడానికి తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబేలు ప్లేయింగ్ ఎలెవన్ లో ప్లేస్ సాధించనున్నారు. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ లో ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్ లు పేస్ విభాగాన్ని లీడ్ చేయనుండగా, రవి బిష్ణోయ్ ఓన్లీ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కొనసాగనున్నాడు. ఫస్ట్ టి20 లో ఫైవ్ బౌలర్ల కాంబినేషన్ తోనే బరిలోకి దిగి సక్సెస్ అయిన ఇండియా, ఈ మ్యాచ్ లో కూడా అదే బౌలింగ్ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని ఫిక్స్ అయింది. ఇక తొలి మ్యాచ్ గెలిచిన భారత్, మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

సెకండ్ టి20 మ్యాచ్ కు ఇండియా ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఎలెవన్:వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్ లు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.