India Aim For Better Batting Performance: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్‌లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో బుధవారం ఇండియా తన రెండో గ్రూప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీకొట్టనుంది. పాకిస్తాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో స్మృతి మంధాన టాప్ ఆర్డర్‌లో, రిచా ఘోష్ లోయర్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించి జట్టును ఆదుకున్నారు. అయితే మిగిలిన బ్యాటర్ల నుంచి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లభించలేదు. ముఖ్యంగా ఓపెనర్ షఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో భారతి ఫుల్మాలి కీలక పాత్ర పోషించాల్సి ఉన్నా, ఫస్ట్ మ్యాచ్‌లో నిరాశపరిచింది. లీగ్ స్టేజ్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి బలమైన టీమ్స్‌తో పోరాడాలంటే ఇండియా బ్యాటర్లు మరింత కన్సిస్టెన్సీ చూపించాల్సిన అవసరం ఉంది.

Continues below advertisement

Read Also: Vaibhav Sooryavanshi Hard Work: రోజూ 8 గంటల ప్రాక్టీస్, 100 ఓవర్ల బ్యాటింగ్.. వైభవ్ సూర్యవంశీ సక్సెస్ సీక్రెట్ -  వండర్ కిడ్ వెనుక ఉన్న కష్టం ఇదీ!

బౌలింగ్ లో స్పిన్ మాయ‌.. పేసర్ల జోరు మిస్..పాకిస్తాన్‌పై మ్యాచ్‌లో ఇండియా స్పిన్ ద్వయం దీప్తి శర్మ, శ్రీ చరణి ప్రత్యర్థిని వణికించారు. వీరిద్దరూ కలిసి ఎనిమిది వికెట్లు తీయగా, దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగింది. వరల్డ్ కప్‌కు ముందు జరిగిన సిరీస్‌లో కాస్త ధారాళంగా రన్స్ ఇచ్చిన దీప్తి, కరెక్ట్ టైమ్‌లో ఫామ్‌లోకి రావడం ఇండియాకు ప్లస్ పాయింట్. ఇక యంగ్ స్పిన్నర్ శ్రీ చరణి తన లైన్ అండ్ ఫ్లైట్‌తో వరల్డ్ క్లాస్ బ్యాటర్లను సైతం ఇబ్బంది పెడుతోంది. అయితే పేసర్లు అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ ఫస్ట్ మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయారు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో వీరు ఎర్లీ బ్రేక్ త్రూస్ ఇచ్చి టీమ్‌ను ఆదుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Continues below advertisement

Read Also: Vaibhav Suryavanshi: లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?

ఫీల్డింగ్ లో మెరుగుపడాలి..పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఫీల్డింగ్ అంత గొప్పగా లేదు. స్టార్టింగ్‌లో కొన్ని ఈజీ క్యాచ్‌లు మిస్ చేసినా, ఇన్నింగ్స్ చివర్లో మాత్రం కొన్ని మంచి క్యాచ్‌లు అందుకున్నారు. సెమీఫైనల్ రేసులో ఉండాలంటే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి జట్లతో తలపడేటప్పుడు ఒక్క రన్ కూడా వేస్ట్ చేయకుండా చూడాలి. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఈజీగానే అనిపించినా, సెమీస్‌కు క్వాలిఫై అవ్వాలంటే ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికాలో ఏదో ఒక టీమ్‌ను ఇండియా కచ్చితంగా ఓడించాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్‌ను ఒక ప్రాక్టీస్ లాగా కాకుండా పర్ఫెక్ట్ గేమ్‌లా ఆడాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.

డచ్ టీమ్ సవాల్.. మరోవైపు నెదర్లాండ్స్ టీమ్ బంగ్లాదేశ్‌పై ఓడిపోయి ఈ మ్యాచ్‌కు వస్తోంది. ఇండియాకు పోటీ ఇవ్వాలంటే డచ్ టీమ్ అన్ని విభాగాల్లో ఇంప్రూవ్ అవ్వాలి. "బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మూడు విభాగాల్లోనూ మేము ఆశించినంత ఫైర్ చూపించలేదు. బ్యాటింగ్‌లో కొన్ని రన్స్ తక్కువ చేశాం, వికెట్లు కూడా త్వరగా కోల్పోయాం. ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు డ్రాప్ చేశాం. ఈ ఎక్స్‌పీరియన్స్ నుంచి చాలా నేర్చుకోవాలి" అని నెదర్లాండ్స్ కెప్టెన్ బాబెట్ డి లీడ్ స్పష్టం చేసింది. ఇండియాను నిలువరించాలంటే డచ్ టీమ్ తన గేమ్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేయాలి.