Ind Vs Eng 2nd T20 Live Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం కటక్ లో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్లతో విజయం సాధించింది. అంతకుమందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. వెటరన్ బ్యాటర్ జో రూట్ (69) టాప్ స్కోరర్. అనంతరం ఛేదనను 44.3 ఓవర్లలో 6 వికెట్లకు 308 పరుగులు చేసింది. దీంతో మరో 33 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరుపు సెంచరీ (90 బంతుల్లో 119, 12 ఫోర్లు, 7 సిక్సర్లు) బాది టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ పై వరుసగా టీ20, వన్డే సిరీస్ ను భారత్ గెలిచినట్లయ్యింది. అలాగే కటక్ లోని బారబతి స్టేడియంలో ఉన్న అజేయ రికార్డును నిలబెట్టుకుంది. గత 23 ఏళ్లుగా ఈ స్టేడియంలో ఇండియా ఓడిపోలేదు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ ఫామ్ లోకి రావడం జట్టుకు సానుకూలాంశం. బౌలర్లలో జామీ ఓవర్టన్ కు రెండు , గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, లివింగ్ స్టన్ కు తలో వికెట్ దక్కింది. . ఇక తర్వాత వన్డే అహ్మదాబాద్ వేదికగా ఈనెల 12న జరుగుతుంది. రోహిత్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
రెండో ఫాస్టెస్ట్ సెంచరీ.. ఛేదనను పాజిటివ్ నోట్ తో ఇండియా ఆరంభించింది. ఒక వైపు రోహిత్ బౌండరీలతో రెచ్చిపోతుంటే శుభమాన్ గిల్ (52 బంతుల్లో60, 9 ఫోర్లు, 1 సిక్సర్) తనకు చక్కని సహకారం అందించాడు. 6 ఓవర్లలోనే 48 పరుగులు ఇండియా చేయడంతో ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్ కాసేపు ఆగింది. ఆ తర్వాత ఆట కొనసాగగా, రోహిత్ తన జోరును కొనసాగిస్తూ.. కేవలం 30 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కుదురుకున్నాక గిల్ కూడా బ్యాట్ ఝుళిపించి 45 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ కళ్లు చెదిరే సిక్సర్లతో ఇంగ్లీష్ బౌలర్లను చితక్కొట్టాడు. ఈక్రమంలో తొలి వికెట్ కు 136 పరుగులు జోడించాక, గిల్ ఔటయ్యాడు. కోహ్లీ (5) కూడా త్వరగానే ఔటవడంతో రోహిత్ కాసేపు గేర్ మార్చి నెమ్మదిగా ఆడాడు. అయతే శ్రేయస్ అయ్యర్ (44) చక్కని సహకారం అందించాడు. రోహిత్ సెంచరీ వైపు వేగంగా దూసుకెళ్లాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్ లో సిక్సర్తో వన్డేల్లో 32వ సెంచరీని కేవలం 76 బంతుల్లోనే పూర్తి చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో రోహిత్ కిది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ, ఆష్గానిస్థాన్ పై కేవలం 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ ఏడు సిక్సర్లు బాదిన హిట్ మ్యాన్, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. 333 సిక్సర్లతో క్రిస్ గేల్ ను వెనక్కి నెట్టాడు. 351 సిక్సర్లతో షాహిద్ ఆఫ్రిది తొలి స్థానంలో ఉన్నాడు.
అక్షర్ అజేయ పోరాటం.. రోహిత్ వెనుదిరిగిన తర్వాత జట్టును అక్షర్ పటేల్ (41 నాటౌట్) విజయ తీరాలకు చేర్చాడు. మధ్యలో సమన్వయ లోపతో అయ్యర్ వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (10) మరోసారి విఫలమవగా, మ్యాచ్ ను త్వరగా ఫినిష్ చేయాలనే తొందర్లో హార్దిక్ పాండ్య (10) ఔటయ్యాడు. అయితే రవీంద్ర జడేజా (11 నాటౌట్) తో కలిసి చివర్లో ఏ డ్రామాకు తావివ్వకుండా టీమిండియాను విజయ తీరాలకు అక్షర్ చేర్చాడు. అంతకుముందు ఇంగ్లాండ్ కు శుభారంభ దక్కినా, గత మ్యాచ్ లోలాగే యూజ్ చేసుకోలేకపోయింది. బ్యాటర్ల వైఫల్యంతో ఓ దశలో 350+ స్కోరు పోతుందని అనుకున్నా, 49.5 ఓవర్లలో కేవలం 304కే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ జో రూట్ (69), బెన్ డకెట్ (65) అర్థ సెంచరీలు బాదారు. భారత బౌలర్లలో జడేజాకు మూడు వికెట్లు దక్కాయి.
Also Read: Rohit Century: రోహిత్ శర్మ రాజసం.. 32వ సెంచరీతో సత్తా.. విమర్శలకు బ్యాట్ తో హిట్ మ్యాన్ సమాధానం