Asia Cup 2025 Ind Vs Pak Final Match Latest News: ఆసియాకప్ లో హీట్ పీక్స్ కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం జరుగుతుంది.ఈ మ్యాచ్ లో గెలుపు కోసం ఇరుజట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. సిమిలర్ గా రెండు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ల్లో థ్రిల్లింగ్ విక్టరీలు సాధించాయి. అన్ డౌటెడ్ గా ఈ మ్యాచ్ లో ఇండియానే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తే పాక్ ను ఈజీగా భారత్ చిత్తు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్ ,బౌలింగ్ లో టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తోంది. అలాగే టోర్నీలో వరుసగా ఆరు మ్యాచ్ ల్లో గెలుపొంది, ఆసియా నెం.1 టీమ్ ట్యాగ్ కు న్యాయం చేసింది. ఏదేమైనా ఈ మ్యాచ్ లో ఇరుజట్ల ఆటగాళ్లు ఎలా ప్రవర్తిస్తారో, ఏదేమైనా వివాదాలు చోటు చేసుకుంటాయా..? అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
వన్ మేన్ షో..ఈ టోర్నమెంట్ లో భారత విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ నామజపమే అన్ని జట్లు చేస్తున్నాయి. బౌలర్లు కలలో కూడా ఉలిక్కి పడేలా అతని ప్రదర్శనలు ఉంటున్నాయి. 200 దగ్గర స్ట్రైక్ రేట్ తో ఈ టోర్నీలో తను 309 పరుగులు సాధించాడు. టీ20 ఎడిషన్ లో ఇదే హైయ్యెస్ట్ స్కోరు కావడం విశేషం. తను ఏమాత్రం సత్తా చాటిన పాక్ గల్లంతవుతుంది. మరో ఓపెనర్ శుభమాన్ గిల్ నుంచి భారీ స్కోరు ఆశిస్తున్నారు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నుంచి స్తాయికి తగ్గ ఇన్నింగ్స్ ఇంకా రాలేదు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, వికెట్ కీపర్ సంజూ శాంసన్ లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, శివమ్ దూబే ఏదో ఒక విభాగంలో సత్తా చాటుతున్నారు. లంకతో మ్యాచ్ లో గాయపడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నారు. 13 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్ గా కుల్దీప్ ఉన్నాడు. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా నుంచి మరింత మెరుగైన ప్రదర్శన ఫైనల్లో వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే 8 టైటిళ్లు గెలిచిన భారత్, తొమ్మిదో టైటిల్ ను సొంతం చేసుకుని, 140 కోట్ల మంది భారతీయులకు అంకితమివ్వాలని ఉవ్విళ్లూరుతోంది.
అన్ ప్రిడిక్టబుల్..పాక్ ఎప్పుడూ అస్థిరమైన జట్టే. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఆ జట్టుకే తెలియదు. నిజానికి ఈ టోర్నీలో అంతంతమాత్రం ప్రదర్శన, కాస్త లక్కు కలిసొచ్చి ఫైనల్ కు చేరుకుంది. బౌలింగ్ కాస్త బలంగా ఉంది కానీ, బ్యాటింగ్ లో తేలి పోతోంది. మ్యాచ్ విన్నర్లు లాంటి బ్యాటర్లు పెద్దగా ఎవరూ లేరు. అంచనాలున్న ఫఖార్ జమాన్, సయూమ్ అయూబ్ తేలిపోయారు. ఇప్పటికే రెండుసార్లు భారత్ పై ఓడిపోవడం ఆ జట్టు ఆటగాళ్లను నిరాశ పర్చేదే. ఇక ఇండియాతో మ్యాచ్ అంటే ఒత్తిడికి లోనవడం ఆ జట్టుకు ఆనవాయితీగా వస్తోంది. 2022 తర్వాత ఇండియాపై ఆ జట్టు ఏ ఫార్మాట్ లోనూ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్ లో ఇండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.