Asia Cup 2025 Ind Vs Pak Final Latest News: ఆసియాకప్ లో మరో కాంట్రవర్సీకి తెరలేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా టోర్నమెంట్ ఫైనల్ కు ముందు రెండు జట్ల కెప్టెన్లతో ఫోటో షూట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆసియాకప్ ఫైనల్ కు ముందు ఇది సాధ్యమయ్యే అవకాశం కన్పించడం లేనట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పందించాడు. తాము ప్రోటోకాల్ ప్రకారం అన్నీ చేయడానికి సిద్దమేనని, అయితే ఇందుకు భారత జట్టు నుంచి సహకారం కావాలని సూచించాడు. అతని మాటలను బట్టి, ఫైనల్ కు ముందు ఫోటో షూట్ ను టీమిండియా బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే హాట్ హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా పాక్ మధ్య హ్యాండ్ షేక్ వివాదం, భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ లో ఆపరేషన్ సింధూర్ , మిలిటరీ గురించి మాట్లాడటం, మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లు హరీస్ రవుఫై ఫైటర్ జెట్ పడిపోయినట్లు గా సిగ్నల్ చేయడం, మరో ప్లేయర సాహిబ్ జాదా ఫర్హాన్ గన్ షూటింగ్ సెలెబ్రేషన్స్ తో ఇప్పటికే బోలెడు వివాదాలు నెలకొన్నాయి. తాజాగా ఫొటో షూట్ వివాదం కూడా తలెత్తినట్లు తెలుస్తోంది.
41 ఏళ్లలో తొలిసారి..1984లో ఆసియాకప్ ప్రారంభమైంది. ఈ టోర్నీని ఎనిమిది సార్లు గెలిచి, అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ నిలిచింది. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ భారత్, పాక్ మధ్య ఫైనల్ పోరు జరుగలేదు. తొలిసారి ఈ పోరు ఆదివారం దుబాయ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో సత్తా చాటి తొమ్మిదో టైటిల్ సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తాజాగా శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై సూపర్ ఓవర్ లో భారత్.. సూపర్ -4 లీగ్ మ్యాచ్ లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కొంతమంది భారత ఆటగాళ్లు క్రాంప్స్ తో బాధపడ్డారు. అయితే మ్యాచ్ వరకల్లా వాళ్లు కోలుకుంటారని సూర్య ఆశాభావం వ్యక్తం చేశాడు.
వెల్లలాగేను ఓదార్చిన సూర్య..లంకతో మ్యాచ్ సందర్బంగా ఆ జట్టు ఆల్ రౌండర్ దునిత్ వెల్లలాగేను సూర్య ఓదార్చాడు. టోర్నమెంట్ మధ్యలో వెల్లలాగే తండ్రి సూరజ్ మరణించారు. దీంతో టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లి, తిరిగి జట్టుతో వెల్లలాగే చేరాడు. తాజాగా ఈ మ్యాచ్ లో లంక డ్రెస్సింగ్ రూంకు వెళ్లి, వెల్లలాగేను సూర్య పరామర్శించి, ఓదార్చాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇక ఎనిమిది జట్టు పాల్గొన్న ఈ ఆసియాకప్ ఆదివారం జరిగే ఫైనల్ తో ముగియనుంది. ఇక లీగ్ దశలో ఒకసారి, సూపర్-4లో మరోసారి పాక్ ను ఓడించిన భారత్, ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈసారి కప్పు గెలిచి తొమ్మిదోసారి చాంపియన్ గా నిలవాలని భావిస్తోంది. మరోవైపు పాక్ రెండుసార్లు ఈ కప్పును దక్కించుకుంది.