ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఏకంగా మూడోసారి తలపడనున్నాయి. ఇదివరకే భారత జట్టు పాకిస్తాన్‌ను ఈ టోర్నీలో రెండుసార్లు ఓడించింది. కానీ ఈసారి ట్రోఫీ కోసం రెండు జట్లు పోటీ పడనున్నాయి. గెలిచిన జట్టు ఆసియా ఛాంపియన్ అవుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి 24 గంటల కంటే తక్కువ సమయం ఉంది. మ్యాచ్‌ను స్టేడియానికి వెళ్లి లైవ్ చూడటం ఒక ప్రత్యేక అనుభూతి, కానీ భారత్-పాక్ ఫైనల్ (IND vs PAK Final Ticket Price) మ్యాచ్ టికెట్లు ఇంకా అందుబాటులో అని క్రికెట్ ప్రేమికులు చెక్ చేస్తున్నారు. ఇక్కడ టికెట్ల సబంధించిన అన్ని వివరాలు తెలుసుకోండి.

Continues below advertisement

భారత్-పాక్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయా ?

సాధారణంగా భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు. టిక్కెట్లు కొన్ని నిమిషాల్లోనే అమ్ముడవుతాయి. అందులోనూ 41 ఏళ్ల తరువాత పాక్, భారత్ ఆసియా కప్ ఫైనల్లో తలపడుతున్నాయి. చివరగా 1984లో భారత్ ఫైనల్లో 54 పరుగుల తేడాతో పాక్ ను ఓడించి తొలి కప్ నెగ్గింది. కానీ ఆసియా కప్‌ 2025లో అలా జరగలేదు. గత కొన్ని దశాబ్దాలలో తొలిసారిగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్లు 24 గంటల్లోనే మ్యాచ్ ఉన్నా ఇంకా అందుబాటులో ఉన్నాయి. Platinumlist.net వెబ్‌సైట్ ద్వారా మీరు టిక్కెట్‌లను ఇప్పుడు కూడా కొనుగోలు చేయవచ్చు, దీని ప్రకారం జనరల్ వెస్ట్, జనరల్ ఈస్ట్, పవలియన్ వెస్ట్, VIP సూట్ వెస్ట్ 11 స్టాండ్ మరియు ప్లాటినం టిక్కెట్లు మాత్రం అమ్ముడయ్యాయి.

లక్షల్లో టికెట్ ధర

భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో స్కై బాక్స్ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర దాదాపు 2 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. VIP సూట్ వెస్ట్ 12 స్టాండ్‌లో ఒక టికెట్ ధర 2.7 లక్షల రూపాయలు. దీంతో పాటు, ది గ్రాండ్ లాంజ్ టిక్కెట్లు ఇప్పటికీ అందుబాటులో ఉండటంతో అభిమానులు షాకవుతున్నారు. ఈ టికెట్ కొనుగోలు చేయడానికి మీరు రూ. 88 వేలు చెల్లించాలి. అదే సమయంలో బౌండరీ లాంజ్‌లో ఒక టికెట్ కొనడానికి రూ.1.5 లక్షలు చెల్లించాలి.

Continues below advertisement

ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం..

భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండు జట్లు మొదటిసారి ఆసియా కప్ ఫైనల్‌లో తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం స్టేడియంలోకి వస్తారు. ఆసియా కప్ చరిత్రలో 41 ఏళ్లలో భారత్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి. సోనీ లివ్, ఫ్యాన్ కోడ్ యాప్, సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు లైవ్ వీక్షించవచ్చు.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహాల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డారు. అమాయకులైన పర్యాటకులు 26 మంది (ఒక నేపాలీ)ని పొట్టన పెట్టుకున్నారు. దాంతో పాకిస్తాన్ తో మ్యాచ్ అంటేనే ఇష్టపడటం లేదు. కొందరు పాక్ ను కసితీరా ఓడించాలి అంటుంటే.. మరికొందరు క్రికెట్ ప్రేమికులు ఉగ్రవాదుల దేశంతో మనకు మ్యాచులు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.