భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌‌లో నాలుగో మ్యాచ్ శనివారం జరుగుతోంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రొవ్‌మన్ పావెల్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. భారత్ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే.


భారత్ ఈ మ్యాచ్‌కు తుది జట్టులో ఎటువంటి మార్పులూ చేయలేదు. మరోవైపు వెస్టిండీస్ మాత్రం మూడు మార్పులు చేసింది. జేసన్ హోల్డర్, షాయ్ హోప్, ఒడియన్ స్మిత్ జట్టులోకి వచ్చారు. జాన్సన్ ఛార్లెస్, ఒడియన్ స్మిత్ బెంచ్‌కు పరిమితం కానున్నారు. ఈ మైదానంలో బౌండరీలు చిన్నగా ఉన్నాయి. గరిష్టంగా బౌండరీ వరకు ఉన్న దూరం కేవలం 70 మీటర్లు మాత్రమే. దీనికి తోడు పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.


టీమ్ ఇండియాకు బ్యాటింగ్ బాగా ఆందోళన కలిగించే అంశం. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల్లో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌ల్లో గిల్ కేవలం రెండు ఫోర్లు మాత్రమే కొట్టగలిగాడు. సంజూ శామ్సన్ కూడా ప్రత్యేకంగా ఏమీ రాణించలేకపోయాడు. సంజు శామ్సన్ మూడు మ్యాచ్‌ల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇషాన్ కిషన్ రెండు మ్యాచ్‌ల్లో 33 పరుగులు సాధించాడు. మూడో మ్యాచ్‌లో అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌కి అవకాశం లభించింది. కానీ యశస్వి కూడా ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. 


Also Read: Citizenship Gave Up: భారత్‌ను వదిలేస్తున్న భారతీయులు - 12 ఏళ్లలో ఏకంగా 16.63 లక్షల మంది, కారణమేంటో తెలుసా?


గత మూడు మ్యాచ్‌ల్లో భారత ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శనను పరిశీలిస్తే... అందులో కూడా పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కెప్టెన్ హార్దిక్ మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. కానీ 80 పరుగులు సమర్పించుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ 98 పరుగులిచ్చి రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ముఖేష్ కుమార్ కూడా 78 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.


వెస్టిండీస్ తుది జట్టు
కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్


భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శామ్సన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్


Also Read: పాకిస్తాన్ ను 4-0తో చిత్తు చేసిన భారత్, అజేయంగా సెమీస్ చేరిన హాకీ టీమ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial