IND vs SL Series 2023: శ్రీలంకంతో జనవరిలో ప్రారంభం కానున్న 3 మ్యాచ్ లో టీ20 సిరీస్ కు బీసీసీఐ నిన్న భారత జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్ త్రయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కు చోటు దక్కలేదు. వీరిని ఎంపిక చేయకపోవడానికి కారణాన్ని కూడా సెలక్టర్లు తెలపలేదు. దీన్నిబట్టి టీ20ల్లో కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వటంపై బీసీసీఐ దృష్టి పెట్టిన్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఇక ఈ త్రయానికి పొట్టి ఫార్మాట్లో స్థానం ఉండకపోవచ్చునని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దశలవారీ విధానం
భారత క్రికెట్ లో 'దశలవారీ' అభివృద్ధిని బీసీసీఐ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముందుగా.. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్ పై బీసీసీఐ దృష్టి పెట్టింది. ఇందుకోసం యువకులు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఫాంలో లేనివారిని పక్కన పెట్టింది. ఇటీవల పెద్దగా రాణించని శిఖర్ ధావన్, రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్ లను జట్టులోకి తీసుకోలేదు. అలాగే ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న రాహుల్ ను వైస్ కెప్టెన్ గా తొలగించింది. అతని స్థానంలో వన్డేల్లో రోహిత్ కు డిప్యూటీగా హార్దిక్ పాండ్యను నియమించింది.
కుర్రాళ్లతో కూడిన టీ20 టీం
ఇక టీ20ల్లో సీనియర్ ఆటగాళ్లను పూర్తిగా పక్కనపెట్టింది సెలక్షన్ కమిటీ. రోహిత్ వేలి గాయం నుంచి కోలుకోనందున అతడిని తీసుకోలేదు. ఇక కోహ్లీ, రాహుల్ లను టీ20 జట్టులోకి ఎంపిక చేయలేదు. రోహిత్ ను టీ20 ఫార్మాట్ కెప్టెన్ గా తొలిగించినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అయితే అతను కోహ్లీ, రాహుల్ తో పాటు క్రమంగా ఈ ఫార్మాట్ నుంచి దూరమవుతాడు. ప్రస్తుతం రోహిత్ శిక్షణ ప్రారంభించినప్పటికీ బొటనవేలి గాయం పూర్తిగా నయం కాలేదు. అయితే దశలవారీగా వారిని తొలగించడం ప్రారంభమైంది. అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు సమాచారం.
శ్రీలంకతో టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్య నాయకత్వం వహించనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అలాగే యువ ఆటగాళ్లు శివమ్ మావి, ముఖేష్ కుమార్ లు పొట్టి ఫార్మాట్ లోకి అరంగేట్రం చేయనున్నారు.
శ్రీలంకతో టీ20 సిరీస్ కు భారత జట్టు