IND Squad SL Series:  టీ20 ప్రపంచకప్ లో భారత్ వైఫల్యం తర్వాత చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బీసీసీఐ తొలగించింది. అయితే ఇప్పటివరకు కొత్త సెలక్షన్ ప్యానల్ ను ఎంపిక చేయలేదు. దీంతో శ్రీలంకతో సిరీస్ కు పాత సెలక్షన్ కమిటీనే జట్టును ఎంపికచేసింది. ఈ సిరీస్ కోసం టీ20, వన్డే జట్టులో కొన్ని షాకింగ్ మార్పులు జరిగాయి. 


శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ల కోసం ఎంపిక చేసిన జట్టులో కొన్ని షాకింగ్ మార్పులు చేసింది సెలక్షన్ కమిటీ. రిషభ్ పంత్ ను టీ20, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పించారు. వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ ను వన్డేలకు ఎంపిక చేయలేదు. అలాగే వన్డేల్లో వైస్ కెప్టెన్సీ నుంచి కేఎల్ రాహుల్ ను తప్పించారు. అతని బదులు హార్దిక్ పాండ్యకు ఆ బాధ్యతలు అప్పగించారు. రాహుల్, రోహిత్, విరాట్ కోహ్లీలు టీ20ల్లో ఆడడంలేదు. శివమ్ మావి, ముఖేష్ కుమార్ లు పొట్టి ఫార్మాట్ లో అరంగేట్రం చేయనున్నారు. 


శ్రీలంక వర్సెస్ భారత్- టీమిండియా స్క్వాడ్ హైలైట్స్



  • టీ20 సిరీస్ కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్య.

  • వన్డేలకు రోహిత్ శర్మ నాయకత్వం.

  • వన్డే వైస్ కెప్టెన్సీ నుంచి రాహుల్ కు ఉద్వాసన.

  • టీ20, వన్డేలకు ఎంపిక కాని రిషభ్ పంత్.

  • వన్డేలకు శిఖర్ ధావన్ ను ఎంపిక చేయలేదు.

  • రెండు జట్లలోనూ భువనేశ్వర్ కుమార్ కు స్థానం లభించలేదు. 

  • శివమ్ మావి, ముఖేష్ కుమార్ టీ20 అరంగేట్రం. 

  • ఫిట్ గా లేని జడేజా, బుమ్రా, దీపక్ చాహర్ లను సెలక్ట్ చేయలేదు. 



శ్రీలంకతో టీ20 సిరీస్ కు భారత జట్టు


హార్దిక్ పాండ్య (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్హదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.


శ్రీలంకతో వన్డే సిరీస్ కు భారత జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్హదీప్ సింగ్.