IND vs SL 1st T20: వాంఖడే వేదికగా జరగనున్న తొలి టీ20లో టీమిండియా- శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 'ఈ పిచ్ మీద రెండో ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం ఉంటుందని భావిస్తున్నాం. అందుకే మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాం. ప్రపంచకప్ మినహా టీ20ల్లో ఇటీవల మేం బాగా రాణించాం. మెరుగవడానికి నిత్యం శ్రమిస్తున్నాం.' అని లంక కెప్టెన్ దసున్ శనక చెప్పాడు.
'ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. దేశం కోసం ఆడడం ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. కొత్త కుర్రాళ్లు తమకు వచ్చిన అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలని ఉంది. ఇది ఛేజింగ్ గ్రౌండ్ అని మాకు తెలుసు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఎలా రాణించాలనే దానిపై మాకు అవగాహన ఉంది. ఈరోజు భారత్ తరఫున ఇద్దరు టీ20 అరంగేట్రం చేయబోతున్నారు. శుభ్ మన్ గిల్, శివమ్ మావిలు తుది జట్టులో ఉన్నారు. అర్హదీప్ అందుబాటులో లేడు.' అని భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య తెలిపాడు.
భారత్ తుది జట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, దీపక్ హుడా, యుజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్.
టీమిండియా తుది జట్టు
పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ శనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక.
ఎక్కడ చూడాలి
స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ లైవ్ టెలికాస్ట్ చూడవచ్చు. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.