సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి  టెస్టులో టీమిండియా మొదటి  ఇన్నింగ్స్ ముగిసింది.  ఫస్ట్ ఇన్నింగ్స్ లో  245 పరుగులకు భారత్ ఆలౌటైంది. 8 వికెట్లుతో 208 పరుగుల ఓవర్నైట్ స్కోర్ తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. అదనంగా ఈరోజు  37 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అత్యంత క్లిష్ట పరిస్థితిలలో రాహుల్ తన లెక్క తేల్చేశాడు. భారత్ కు గౌరవమైన స్కోర్ అందించాడు.  టెయిలెండర్లతో కలిసి రాహుల్ ఒక్కో పరుగూ జోడిస్తూ.. టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 164 పరుగుల దగ్గర 7వ వికెట్ కోల్పోయిన తర్వాత బుమ్రా, సిరాజ్ లతో కలిసి రాహుల్ స్కోరును 245 పరుగుల వరకూ తీసుకెళ్ళాడు.  కోహ్లి 38, శ్రేయస్ అయ్యర్ 31, శార్దూల్ ఠాకూర్ 24 పరుగులు చేశారు.


సిక్సర్‌తో  సెంచరీ పూర్తి చేసిన రాహుల్..


సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ అద్భుత  సెంచరీ చేశాడు. ఈ దెబ్బకి బుధవారం సెంచూరియన్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన రెండో భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.  రెండో రోజు ఉదయం 70 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన రాహుల్.. చివరికి 137 బంతుల్లో 101 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. తన 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేఎల్ 66వ ఓవర్‌లో గెరాల్డ్ కుట్జీపై మిడ్-వికెట్ వైపు సిక్సర్ కొట్టాడు. రాహుల్ కేవలం 80 బంతుల్లో సిక్సర్ కొట్టి యాభైని పూర్తి చేశాడు. తొలి రోజు 70 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్.. రెండో రోజు 101 పరుగులు పూర్తి చేసిన చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 245 పరుగుల వద్ద ఆగిపోయింది. సెంచూరియన్‌లో రాహుల్‌కి ఇది వరుసగా రెండో సెంచరీ. భారత్ గత చివరి సిరీస్‌లో మూడంకెల మార్కును చేరుకున్నాడు. దీంతో ఒకే వేదికలో అధిక సెంచరీలు చేసిన మొదటి విజిటింగ్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.


సెంచూరియన్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు మొదటినుంచీ మంచి ఆరంభం లభించ లేదు. యశస్వీ జైశ్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా వచ్చారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో నిష్క్రమించాడు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ బంతితో నిప్పులు చెరిగాడు. రబాడ ఇన్నింగ్స్ 5వ ఓవర్ చివరి బంతికి రోహిత్ క్యాచౌట్ గా వెనుదిరిగాడు. ఆపై వన్ డౌన్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్ కు దిగాడు. అంతలోనే మరో ఓపెనర్ ఔటయ్యాడు. నాండ్రీ బర్గర్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (17) ఇచ్చిన క్యాచ్ ను కైల్ పట్టడంతో భారత్ 23 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఆపై వన్ డౌన్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ (2) మూడో వికెట్ రూపంలో ఔటయ్యాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు ఇబ్బంది పడిన గిల్ ను నాండ్రీ బర్గర్ ఓట్ చేశాడు. దాంతో కేవలం 24 పరుగులకే టీమిండియా ముగ్గురు టాపార్డర్ బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది.  ఈ లెక్కన తవయి రోజు 8 వికెట్లుతో 208 పరుగులతో ఆట ముగించింది..ఇక ఈరోజు రాహుల్  సెంచరీ తో స్కోరు 245 తో ఆట భారత ఇన్నింగ్స్ ముగిసింది.