టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కటక్‌లోని బారాబతి మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఈ ఐదు టీ20 మ్యాచ్‌లు ఉన్న సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి 1-1తో సిరీస్ సమం చేస్తుందో లేక ఓడి 2-0 ఆధిక్యాన్ని దక్షిణాఫ్రికాకు అందిస్తుందో చూడాలి.


టీమిండియా తుదిజట్టు
ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్


దక్షిణాఫ్రికా తుదిజట్టు
హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, రాసీ వాన్ డర్ డుసెన్, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తబ్రయిజ్ షంసి, కగిసో రబడ, ఆన్రిచ్ నోర్జే