IND vs SA 1st T20I: దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ కు ఈ సిరీస్ కు విశ్రాంతినిచ్చారు. వారి స్థానంలో పంత్, అర్హ దీప్ జట్టులోకి వచ్చారు. అలాగే బుమ్రా, చాహల్ లు ఈ మ్యాచులో ఆడడంలేదు. వారి బదులుగా దీపక్ చాహర్, అశ్విన్ లు ఆడనున్నారు.


బ్యాటింగ్ పర్వాలేదు


ఆస్ట్రేలియాతో జరిగిన 3 టీ20 ల సిరీస్ ను 2-1తో చేజిక్కుంచుకున్న భారత్.. ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికాతో బరిలోకి దిగనుంది. ఈ సిరీస్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు విశ్రాంతినిచ్చారు. బ్యాటింగ్ పరంగా చూస్తే టాపార్డర్ లో ఒకరు విఫలమైతే మరొకరు రాణిస్తున్నారు. దీంతో భారత్ భారీ స్కోర్లు చేస్తోంది. రాహుల్ నిలకడగా ఆడాల్సిన అవసరముంది. రోహిత్, కోహ్లీలు ఫామ్ కొనసాగించాలి.  దినేశ్ కార్తీక్ ఫినిషర్ స్థానానికి న్యాయం చేస్తున్నాడు.  అతనికి ఇంకా కొంచెం గేమ్ టైమ్ ఇవ్వాల్సిన అవసరముంది.  


డెత్ కు ఆఖరి ఛాన్స్


భారత్ ను బౌలింగ్ విభాగం కలవరపెడుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లు. గత కొంతకాలంగా భారత బౌలర్లు ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. భువీ దూరమైన నేపథ్యంలో దీపక్ చాహర్ కానీ, అర్హదీప్ సింగ్ కానీ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. హర్షల్ పటేల్ అంచనాలకు తగ్గట్లు రాణించాలి. అక్షర్ పటేల్ భీకర ఫాంలో ఉండడం భారత్ కు కలిసొచ్చే అంశం.  


దక్షిణాఫ్రికా బలంగానే


మరోపక్క దక్షిణాఫ్రికా బలంగా కనిపిస్తోంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రొటీస్ జట్టు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. డికాక్, బవుమా, మార్ క్రమ్, మిల్లర్ వంటి బ్యాట్స్ మెన్లు.. రబాడ, హెన్రిచ్, నోర్జే, కేశవ్ మహరాజ్ వంటి బౌలర్లతో దక్షిణాఫ్రికా భీకరంగా కనిపిస్తోంది. ఆ జట్టుకు కూడా టీ20 ప్రపంచకప్ ముంగిట ఇదే చివరి సిరీస్. కాబట్టి దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ సిరీస్ హోరాహోరీగా సాగనుంది. 


 


భారత్ తుది జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అర్ష్ దీప్ సింగ్


దక్షిణాఫ్రికా తుది జట్టు


 క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రిలీ రోసౌవ్, అయిడెన్ మార్ క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కగిసో రబడ, కేశవ్ మహారాజ్, అన్రిచ్ నార్టే, తబ్రైజ్ షంసీ