IND vs SA 1st ODI Live Streaming | రాంచీ: టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయి దాదాపు అయిదారు దశాబ్దాల చెత్త రికార్డులను ఖాతాలో వేసుకున్న టీమిండియా వన్డే సిరీస్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ కోసం రెండు జట్లు సిద్ధంగా ఉన్నాయి. వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్  నవంబర్ 30, 2025న రాంచీ వేదికలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. 

Continues below advertisement

టెస్ట్ సిరీస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని క్రికెట్ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణంగా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి పెద్ద ఆటగాళ్ళు జట్టులో ఉన్నారు. కనుక వన్డే సిరీస్ కోసం అభిమానులు చూస్తున్నారు. పటిష్ట టీమిండియా వన్డే సిరీస్ లో సఫారీలపై నెగ్గుతారని సంకేతాలు కనిపిస్తున్నాయి.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య మొదటి వన్డే రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో ఆదివారం నాడు జరగనుంది. అయితే స్టేడియానికి వెళ్లి చూడలేని వారు హాయిగా ఇంట్లో కూర్చుని లైవ్ స్ట్రీమింగ్, టీవీ ప్రసార ఆప్షన్లు ఉన్నాయి. వాటి గురించి క్రికెట్ అభిమానులు తెలుసుకోవాలి. 

Continues below advertisement

భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లైవ్ స్ట్రీమింగ్

టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా జరగనున్న మొదటి వన్డే మ్యాచ్ జియోహాట్‌స్టార్ యాప్, జియో హాట్‌స్టార్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే, మ్యాచ్‌ని చూడటానికి అభిమానులు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉండాలి.  

భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే టీవీ ప్రసారం

టీవీలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో మ్యాచ్ లైవ్ చూడవచ్చు. టాస్ ఆట ప్రారంభానికి 30 నిమిషాల ముందు, అంటే మధ్యాహ్నం 1:00 గంటలకు వేస్తారు. టాస్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికా జట్ల ప్లేయింగ్ XI ప్రకటిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు డే అండ్ నైట్ వన్డే ప్రారంభం కానుంది. వాస్తవానికి భారత్‌లో సిరీస్ కనుక ఉదయం వేళ నుంచి సాయంత్రం వరకు మ్యాచ్ ఉంటుందని ఆశించిన ఫ్యాన్సుకు నిరాశే ఎదురవుతోంది.

భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్: పూర్తి స్క్వాడ్‌లు

భారత్ పూర్తి ఆటగాళ్లు- రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (కెప్టెన్), తిలక్ వర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, రుతురాజ్ గైక్వాడ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్

దక్షిణాఫ్రికా పూర్తి ఆటగాళ్లు - టెంబా బావుమా (కెప్టెన్), ఓట్నీల్ బార్ట్‌మన్,మాథ్యూ బ్రీట్జ్‌కే, ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రమ్, కార్బిన్ బోష్, డెవాల్డ్ బ్రెవిస్, నాండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడి, ప్రెనెలాన్ సుబ్రాయెన్