Cricket WC 2023, IND vs PAK:
వన్డే ప్రపంచకప్ షెడ్యూలును ఐసీసీ అలా ప్రకటించిందో లేదో! మ్యాచులు నిర్వహించే నగరాల్లో హోటల్ బుకింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అన్నిటితో పోలిస్తే అహ్మదాబాద్‌లో రష్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్లోనే అత్యంత ఆసక్తికర మ్యాచ్ ఉండటమే ఇందుకు కారణం. అక్టోబర్ 15న భారత్, పాకిస్థాన్ జట్లు నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఇక్కడి హోటల్ గదుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు ఇంకా వంద రోజుల సమయం ఉంది. అయితే పెద్ద జట్ల మధ్య మ్యాచులు జరుగుతున్న రోజు హోటల్ అడ్వాన్స్ బుక్సింగ్ పెరిగాయి. దేశ విదేశాల నుంచి మ్యాచులు జరిగే నగరాల్లోని హోటళ్లకు కాల్స్ వస్తున్నాయి. ఇక అహ్మదాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైవ్‌స్టార్ హోటల్లోబేస్ కేటగిరీ గదుల అద్దె ఒక రాత్రికి రూ.50వేల వరకు పెరిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. సాధారణంగా వీటి ధర ఒక రోజుకు రూ.6500 నుంచి రూ.10,500 వరకు ఉంటుంది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ మొత్తం 46 రోజులు జరుగుతుంది. పది జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. అక్టోబర్ 5 నుంచి టోర్నీ మొదలవుతుంది. నవంబర్ 19న మెగా ఫైనల్ జరుగుతుంది. మెగా టోర్నీ ఆరంభ, ఆఖరి మ్యాచులకు లక్షా పదివేల మంది వీక్షించే మొతేరా మైదానం ఆతిథ్యం ఇస్తోంది. అంతేకాకుండా భారత్, పాకిస్థాన్ మ్యాచూ ఇక్కడే జరుగుతోంది.
'అక్టోబర్ 15న జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచుపై ఇంట్రెస్టు పెరుగుతోంది. నగరంలోని హోటళ్లలో అక్టోబర్ 13 నుంచి 16 మధ్య బుక్సింగ్ జరుగుతున్నాయి. మ్యాచులు జరిగే రోజుల్లో హోటల్ గదులన్నీ బుక్ అవుతాయని మేం అంచనా వేస్తున్నాం' అని ఐటీసీ నర్మదా జనరల్ మేనేజర్ కీనాన్ మెకెన్జీ అంటున్నారు. 'అంతర్జాతీయ క్రికెట్ బృందాలు, అభిమానుల, స్పాన్సర్ల నుంచి హోటల్ గదుల బుకింగ్‌పై ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. వీవీఐపీఎలకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి' అని ఆయన తెలిపారు.
ఈ ప్రపంచకప్‌లో అహ్మదాబాద్ మొత్తం ఐదు మ్యాచులకు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే ఈ రోజులకు సంబంధించి అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో 60-90 శాతం వరకు గదులు బుక్ అయ్యాయని తెలిసింది. 'మ్యాచు రోజుల్లో 80 శాతం వరకు గదులు బుక్ అయ్యాయి. ఆరంభోత్సవం, ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మొదటి మ్యాచు కోసం ఇంగ్లాండ్, మేజర్ కార్పొరేషన్ల నుంచి ట్రావెల్ ఏజెన్సీలు బుకింగ్ చేశాయి' అని హయత్ రీజెన్సీ అహ్మదాబాద్ జనరల్ మేనేజర్ పునిత్ బైజాల్ అన్నారు.
ప్రీమియం కేటగిరీ గదులు ఒక రోజుకు రూ. లక్ష కన్నా ఎక్కువ పలుకుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ 14-16 తేదీల్లో తాజ్ గ్రూప్ హోటళ్లలో గదులన్నీ బుక్ అయ్యాయని సంకల్ప్ గ్రూప్ ఉపాధ్యక్షుడు అతుల్ బుధరాజా తెలిపారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial