Asia Cup Final Prize Money: ఆసియా కప్ 2025 విజేతగా టీమిండియా నిలిచింది. 41 సంవత్సరాలలో మొదటిసారిగా ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. భారత్-పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజేతగా నిలిచన భారత జట్టుకు ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్ మనీ (Asia Cup 2025 Prize Money) లభిస్తుంది. ఈసారి ఆసియా కప్ ప్రైజ్ మనీ 2022లో జరిగిన టోర్నమెంట్‌తో పోలిస్తే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ప్రైజ్ మనీని విజేత జట్టు అందుకుంటుంది.

Continues below advertisement

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ప్రైజ్ మనీ

ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రతి సీజన్ టోర్నీకి ప్రైజ్ మనీని పెంచుతోంది. ఈసారి కూడా విజేత జట్టుకు గతంలో కంటే ఎక్కువ ప్రైజ్ మనీ వస్తుంది. అలాగే ఆసియా కప్ 2025 ప్రైజ్ మనీ దాదాపు రూ.2.66 కోట్లు కాగా, గత సీజన్ 2022తో పోలిస్తే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంది.

    • 2022లో ఆసియా కప్ ఫైనల్ శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరిగింది. అప్పుడు శ్రీలంక ఈ టైటిల్‌ను గెలుచుకోగా, రెండు లక్షల US డాలర్లు (2,00,000 US డాలర్లు) ప్రైజ్ మనీగా అందుకుంది. రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ ఒక లక్ష US డాలర్లు (1,00,000 US డాలర్లు) అందుకుంది.
    • 2023లో ఆసియా కప్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. అప్పుడు ఇండియాకు ప్రైజ్ మనీ 2.5 లక్షల US డాలర్లు (2,50,000 US డాలర్లు) లభించింది. అదే సమయంలో రన్నరప్‌ శ్రీలంక జట్టుకు 1.25 లక్షల US డాలర్లు (1,25,000 US డాలర్లు) గెలుచుకుంది.
    • 2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఫైనల్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు మూడు లక్షల US డాలర్లు (3,00,000 US డాలర్లు) ప్రైజ్ మనీ భారత కరెన్సీలో సుమారు రూ.2.66 కోట్లు లభిస్తుంది. రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు ఒకటిన్నర లక్షల US డాలర్లు (1,50,000 US డాలర్లు) భారత కరెన్సీలో దాదాపు రూ.1.33 కోట్లు లభిస్తాయి.

ఆసియా కప్ 2025 ప్రైజ్ మనీ 2022లో 2 లక్షల US డాలర్లుగా ఉండగా, ఇప్పుడు 3 లక్షల అమెరికా డాలర్లకు పెంచారు. భారత కరెన్సీలో ఆసియా కప్ ఫైనల్ ప్రైజ్ మనీ 2.6 కోట్ల రూపాయలకు సమానం. అదే సమయంలో రన్నరప్‌ పాక్‌కు 1.33 కోట్ల రూపాయలు అందజేస్తారు. ఆసియా కప్ లో మూడోసారి పాక్ జట్టును భారత్ చిత్తు చేయడాన్ని క్రికెట్ ప్రేమికులు ఎన్నటికీ మరిచిపోరు.