India Playing XI vs New Zealand 1st ODI: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే నవంబర్ 25న జరగనుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆక్లాండ్‌లో జరగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్ కోసం విశ్రాంతినిచ్చారు. అతని గైర్హాజరీతో శిఖర్ ధావన్ టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్‌తోపాటు విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌లో ఆడటం లేదు. టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేయడానికి ఇది సరైన అవకాశంగా భావించి ఈ నిర్ణయం తీసుకుంది. తొలి వన్డేలో అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లో ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తోంది. టీ20 మ్యాచ్‌లలో తను తాను నిరూపించుకున్నాడు అర్షదీప్ సింగ్. కుల్దీప్ సేన్ కూడా ఫైనల్ 11 రేస్‌లో ఉన్నాడు.
ఉమ్రాన్ అరంగేట్రం చేయవచ్చు
న్యూజిలాండ్‌తో ఆడిన టీ20 సిరీస్‌కు ఎంపికైన టీంలో ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. అర్ష్దీప్ సింగ్ టీ20 సిరీస్‌లో పాల్గొనడమే కాకుండా టీ20 వరల్డ్‌కప్‌లో కూడా ఆడాడు. ఉమ్రాన్ చాలా కాలంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని కెప్టెన్ శిఖర్ ధావన్‌కు తెలుసు. ఇప్పటికే ట 20ల్లో ఇచ్చిన ప్రతి అవకాశాన్ని అర్దీప్ సింగ్ యుటిలైజ్ చేసుకున్నాడు. కానీ ఇంత వరకు వన్డేల్లో ఆడే ఛాన్స్ మాత్రం రాలేదు. భవిష్యత్ కారణాల దృష్ట్యా ఉమ్రాన్ మాలిక్‌కు ఛాన్స్ లభించవచ్చని తెలుస్తోంది.
ఉమ్మాన్ మాలిక్‌కే తొలి వన్డేలో అరంగేట్రం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. న్యూజిలాండ్ పిచ్లపై ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తారు. ఉమ్రాన్ ఎక్కువగా ఐపీఎల్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో వన్డే సిరీస్‌లో భారత్ తరఫున ఆడగలిగే సత్తా ఉందని... న్యూజిలాండ్ పిచ్‌లపై బాగా రాణిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉంది టీం.
న్యూజిలాండ్ వెళ్లిన భారత్ వన్డే జట్టు ఇదే!
శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.