IND vs NZ 3rd T20I:  అహ్మదాబాద్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య జరగనున్న సిరీస్ డిసైడర్ టీ20లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిలపాలనుకుంటున్నట్లు టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. 


'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్. ఇక్కడ మేం గతేడాది ఐపీఎల్ ఫైనల్ ఆడాం. రెండో ఇన్నింగ్స్ లో బంతి కొంచెం టర్న్ అయ్యింది. గత రెండు మ్యాచుల్లో బ్యాటర్లకు పరీక్ష ఎదురైంది. అయితే మా ఆటగాళ్లు పట్టుదల చూపించారు. ఈ రకమైన గేములు ఆడడం వల్ల ఎంతో నేర్చుకోవచ్చు. మా జట్టులో ఒక మార్పు జరిగింది. చాహల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చాడు.' అని పాండ్య చెప్పాడు. 


'మేము మొదట బౌలింగ్ చేయబోతున్నాము. మేం ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. ఇక్కడ ఆడడం మాకు గొప్ప అనుభవం. సిరీస్ డిసైడర్ కాబట్టి మా బాయ్స్ మరింత పట్టుదలగా ఆడాలనుకుంటున్నారు. సవాళ్లను స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. మా జట్టులో జాకబ్ డఫీ స్థానంలో బెన్ లిస్టర్ వచ్చాడు.' అని కివీస్ కెప్టెన్ శాంట్నర్ తెలిపాడు. 






గత రికార్డులు


2012 లో న్యూజిలాండ్ భారత్ లో ఒక టీ20 మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు భారత్ లో ఆ జట్టు ఏ ఫార్మాట్ లోనూ ఒక్క సిరీస్ నెగ్గలేదు.  


పిచ్ ఎలా ఉందంటే..


ప్రపంచంలోనే అహ్మదాబాద్ పిచ్ అతి పెద్దది. పెద్ద బౌండరీలు ఉన్నా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. వికెట్ మొదట బ్యాటింగ్ కు సహకరిస్తుంది. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లు లబ్ధి పొందవచ్చు. 


భారత జట్టు 


శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.


న్యూజిలాండ్ జట్టు 


ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఇష్ సోధి, బెన్ లిస్టర్, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.