IND vs NZ 3rd ODI: నవంబర్ 30న భారత్- న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్ చర్చ్ లో నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఈ సిరీస్ లో ప్రస్తుతం కివీస్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. మొదటి మ్యాచులో న్యూజిలాండ్ గెలవగా.. రెండోది వర్షం కారణంగా రద్దయింది. కాబట్టి మూడో వన్డే ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ నెగ్గాలని కివీస్... ఇందులో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని టీమిండియా జట్లు పట్టుదలగా ఉన్నాయి.
ఎక్కడ, ఎప్పుడు జరగనుంది
ఈ మ్యాచ్ నవంబర్ 30న క్రైస్ట్ చర్చ్ లోని హాగ్లీ ఓవల్ మైదానంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది.
ఎక్కడ చూడవచ్చు
ఇది డీడీ స్పోర్ట్స్ ఛానల్ లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది.
భారత తుది జట్టు (అంచనా)
శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, అర్హదీప్ సింగ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, యుజువేంద్ర చహాల్, వాషింగ్టన్ సుందర్
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖెల్ బ్రేస్ వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్సీ, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ.
సంజూకు ఛాన్సిస్తారా!
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో సంజూ శాంసన్‌ను (Sanju Samson) తొలగించడం మరోసారి విమర్శలకు దారితీసింది. బాగా ఆడుతున్నా అతడిని పక్కన పెట్టడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు. బీసీసీఐ, సెలక్షన్ కమిటీ, జట్టు యాజమాన్యంపై విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే అతడిని పక్కన పెట్టారేమోనని ఛలోక్తులు విసురుతున్నారు. పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న రిషభ్ పంత్ ఎందుకు ముద్దయ్యాడని నేరుగా ప్రశ్నిస్తున్నారు.
మరి ఈ నేపథ్యంలో మూడో వన్డేలో అయినా సంజూకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.