IND vs NZ, 2nd ODI: భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో వర్షం మొదలయ్యింది. అప్పటికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 19 పరుగులు, శిఖర్ ధావన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికీ ఇంకా వర్షం తగ్గలేదు. 


వరుణుడు అడపాదడపా అంతరాయం కలిగించినప్పటికీ.. మ్యాచ్‌ 29 ఓవర్లకు కుదించి ఆటను ప్రారంభించారు. మరోసారి వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో 12.5 ఓవర్ల వద్ద ఆటను అంపైర్లు నిలిపేశారు. అంతకుముందు ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ (3) త్వరగానే ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌ (34*)తో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (45*) భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అర్ధశతక (66) భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 12.5 ఓవర్లకు 89/1.


నిర్దిష్ట సమయానికి వర్షం తగ్గకపోవటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ భారత్ కు చాలా కీలకమైనది. ఇందులో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా అనుకుంది. అయితే వరుణుడు ఆ అవకాశం ఇవ్వలేదు. బుధవారం చివరిదైన మూడో వన్డే జరగనుంది. 






భారత్ తో రెండో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఒక మార్పు చేసింది. ఆడమ్ మిల్నే స్థానంలో మైఖెల్ బ్రేస్ వెల్ ను తీసుకుంది. ఇప్పటిదాకా పిచ్ కవర్లతో కప్పి ఉంది. కాబట్టి సీమర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నాను. మా పేసర్లు శుభారంభం ఇస్తారని ఆశిస్తున్నాను. అని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అన్నాడు. 


తాను టాస్ గెలిస్తే ముందు బౌలింగే ఎంచుకునే వాళ్లమని టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ చెప్పాడు. అయితే సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేస్తామని అన్నాడు. భారత్ రెండు మార్పులు చేసింది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్, సంజూ శాంసన్ స్థానంలో దీపక్ హుడా జట్టులోకి వచ్చారు.


బ్యాటింగ్ ఓకే


బ్యాటింగ్ లో భారత్ బలంగానే కనిపిస్తోంది. తొలి వన్డేలో ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. శ్రేయస్, సంజూ శాంసన్ లు ఇన్నింగ్స్ ను నిర్మించారు. అయితే మిడిలార్డర్ లో పంత్, సూర్యలు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. పంత్ వైఫల్యం వన్డేల్లోనూ కొనసాగుతోంది. సూర్య వన్డేల్లో రాణించాల్సిన అవసరముంది.  ఇక ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటర్లంతా సమష్టిగా చెలరేగితే భారీ స్కోరు చేయడం ఖాయమే. 


బౌలింగ్ మెరుగుపడేనా!


బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవడం భారత్‌కు చాలా అవసరం. తొలి వన్డేలో 300పై లక్ష్యాన్ని కూడా మన బౌలర్లు కాపాడలేకపోయారు. ఈ ఫార్మాట్లో ఏళ్లుగా భారత్‌పై నిలకడగా రాణిస్తోన్న లేథమ్‌, విలియమ్సన్‌లను కట్టడి చేయడానికి వాళ్లు మార్గాలను అన్వేషించాల్సిన అవసరముంది. యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ 145 కిలోమీటర్ల పై వేగంతో ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్‌ స్వింగ్‌ చేసే సామర్థ్యమున్నా పేస్‌తో ఇబ్బందిపడ్డాడు. శార్దూల్‌ ఠాకూర్‌ లయ తప్పాడు. స్పిన్నర్‌ చాహల్‌ కూడా పుంజుకోవాల్సివుంది. ఇక ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం లేకపోవడం భారత్‌కు సమస్యగా మారింది. ఆక్లాండ్‌లో ఆడిన టాప్‌-6 బ్యాటర్లలో ఒక్కరూ బౌలింగ్‌ చేయలేరు. ఈ నేపథ్యంలో ఆరో బౌలర్‌ సమస్యను అధిగమించడానికి టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడాను తీసుకుంది. శార్దూల్‌ స్థానంలో దీపక్‌ చాహర్‌ జట్టులోకి వచ్చాడు. 






 


న్యూజిలాండ్ తుది జట్టు:


 ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైఖెల్ బ్రేస్ వెల్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్.


భారత తుది జట్టు:


శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్), దీపక్ హుడా , వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.