Anderson- Tendulkar Trophy Result Update: టెస్టు క్రికెట్ లోని మజాను అభిమానులు మరోసారి రుచి చూశారు. ముఖ్యంగా ఐదో రోజులోని నాటకీయతను అనుభవించారు. ఇండియా, ఇంగ్లాండ్ జట్లు హోరాహోరీగా పోరాడటంతో క్రికెట్ అభిమానులు సీట్లకు అతుక్కు పోయారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఐదో టెస్టులో ఒత్తిడిని అధిగమించిన టీమిండియా 6 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.
ముఖ్యంగా సోమవారం ఐదో రోజు ఆరంభం నుంచి నెయిల్ బిట్టింగ్ గా జరిగిన ఈ మ్యాచ్ లో విజయానికి 35 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌట్ అయింది. హారీ బ్రూక్ (111) టాప్ స్కోరర్. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (5/104) ఫైఫర్ తో సత్తా చాటాడు దీంతో ఈ మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ క్రమంలో ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసింది. ఈ సిరీస్ లోని తొలి, మూడు మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ గెలవగా, రెండు, ఐదో టెస్టులో టీమిండియా విజయం సాధించాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ముగ్గురు స్పెషలిస్టు బౌలర్లతోనే బరిలోకి దిగిన భారత్ అద్భుత విజయం సాధించినట్లయ్యింది. ఒక టెస్టులో భారత్ గెలిచిన అతి తక్కువ మార్జిన్ తో గెలిచింది.
నరాలు తెగే ఉత్కంఠ..ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లాండ్ ను ఆరంభం నుంచే బౌలర్లు వణికించారు. ముఖ్యంగా అద్భుతమైన స్పెల్ తో సిరాజ్ గడగడలాడించాడు. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (2) ని సిరాజ్ బోల్తా కొట్టించాడు. ఆఫ్ స్టంప్ కు కాస్త దూరంగా వెళ్లిన బంతిని వేటాడిన స్మిత్.. కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ స్పెషలిస్టు బ్యాటర్ కూడా ఔటయినట్లు అయింది. ఆ తర్వాత జామీ ఓవర్టన్ (9) రెండు ఫోర్లతో కంగారు పెట్టించినా, అతడిని కూడా సిరాజ్ ఎల్బీగా పెవిలియన్ కి పంపాడు.
వోక్స్ స్ఫూర్తిదాయకం..నాలుగో టెస్టులో గాయంతో బరిలోకి దిగి ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అలరంచగా.. ఈ మ్యాచ్ లో క్రిస్ వోక్స్ ఆ విధంగా వ్యవహరించాడు. తన ఎడమ భుజం డిస్ లోకెట్ అయినప్పటికీ, ఒంటి చేత్తోనే బ్యాటింగ్ కు దిగి క్రీడా స్ఫూర్తిని చాటాడు. అంతకుముందు జోష్ టంగ్ ను ప్రసిధ్ కృష్ణ డకౌట్ చేశాడు. వోక్స్ బ్యాటింగ్ దిగాక గస్ అట్కిన్సన్ (17) వేగంగా పరుగులు చేస్తూ, మ్యాచ్ గెలిచేందుకు విఫలయత్నం చేశాడు. మధ్యలో సిరాజ్ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద ఆకాశ్ దీప్ పొరపాటు చేయడంతో అట్కిన్సన్ కు సిక్సర్ వచ్చింది. అయినప్పటికీ, అద్బుతమైన యార్కర్ తో అట్కిన్సన్ ను బోల్తా కొట్టించి, ఇండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఈ సిరీస్ లో 180+ ఓవర్లు వేసి, తన కమిట్మెంట్ ను సిరాజ్ చాటుకున్నాడు.