IND vs ENG 5th Test: భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదో టెస్టు టాస్‌ వేశారు. ఇంగ్లాండ్‌ సారథి బెన్‌స్టోక్స్‌ టాస్‌ గెలిచి మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఛేదనలో తాము మెరుగ్గా రాణిస్తున్నామని అన్నాడు. తొలుత బౌలింగ్‌ చేస్తే పిచ్‌ ఎలా స్పందిస్తుందో అర్థమవుతుందని పేర్కొన్నాడు. మూమెంటన్‌ను ఇలాగే కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలిపాడు.


టీమ్‌ఇండియాకు నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని జస్ప్రీత్‌ బుమ్రా అన్నాడు. ఇదో గొప్ప గౌరవంగా పేర్కొన్నాడు. ఇంతకన్నా మెరుగైంది మరోటి ఉండదన్నాడు. తమ జట్టుకు చక్కని ప్రాక్టీస్‌ లభించిందని వెల్లడించాడు. ఇంగ్లాండ్‌ వాతావరణానికి అలవాటు పడ్డామని పేర్కొన్నాడు.


ఇంగ్లాండ్‌: అలెక్స్‌ లీస్‌, జాక్‌ క్రాలీ, ఒలీ పోప్‌, జో రూట్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌, సామ్‌ బిల్లింగ్స్‌, మాథ్యూ పాట్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జాక్‌ లీచ్‌, జేమ్స్‌ అండర్సన్‌


భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా , హనుమ విహారి, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌, రిషభ్ పంత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్ , మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా




పిచ్ ఎలా ఉందంటే?


ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌ గట్టిగా ఉండటమే కాకుండా పచ్చికతో కనిపిస్తోంది. తొలిరోజు మధ్యాహ్నం, రెండో రోజు ఉదయం చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అలాంటప్పుడు స్వింగ్‌ బౌలింగ్‌ కీలకం అవుతుంది. ఈ మైదానంలో టీమ్‌ఇండియా ఒక్క మ్యాచైనా గెలవలేదు. 6 ఓడింది. 1986లో ఒక మ్యాచ్‌ డ్రా చేసుకుంది. బ్యాటర్లు ఇంగ్లాండ్‌ పిచ్‌లపై 2021లో 28.25 సగటు, 2.9 ఎకానమీతో పరుగులు చేయగా ఇప్పుడా గణాంకాలు 37.11, 3.8గా మారాయి.