ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోరు చేసి ఇంగ్లండ్‌ను కట్టడి చేయాలనేది రోహిత్ సేన ప్రణాళిక. భీకర ఫాంలో ఉన్న ఇంగ్లండ్‌ను ఆపడమే టీమిండియా ముందున్న అసలైన సవాల్. ఇప్పటికే చివరి టెస్టులో ఘోరమైన ఓటమితో మానసికంగా టీమిండియా వెనకబడింది.
ఇంగ్లండ్ తుదిజట్టు
జేసన్ రాయ్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియాం లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టాప్లే, మాథ్యూ పార్కిన్సన్
టీమిండియా తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్