భారత్, బంగ్లాదేశ్ జట్ల మూడో వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. మొదటి రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా ఇప్పటికే 0-2తో ఓటమి పాలైంది. దీంతో మూడో వన్డే నామమాత్రం అయింది. అయితే ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే క్లీన్ స్వీప్ అయిన అపవాదు భారత్ ఖాతాలో పడనుంది. కాబట్టి ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.
భారత్ vs బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ మ్యాచ్ ఏ సమయంలో జరగనుంది?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ డిసెంబర్ 10వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది.
భారత్ vs బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ చట్టోగ్రామ్‌లోని జహూర్ అహ్మద్ చౌదరి మైదానంలో జరగనుంది.
భారత్ vs బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ మ్యాచ్‌ను టీవీలో ఎక్కడ చూడాలి?
భారత్ vs బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
భారత్ vs బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడాలి?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
బంగ్లాదేశ్: లిట్టన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, మహ్మదుల్లా, నజ్ముల్ హుస్సేన్ శాంటో, హసన్ సోహన్