IND vs AUS World Cup Final 2023:   దేశవ్యాప్తంగా ప్రపంచకప్  ఫైనల్  ఫీవర్ కనిపిస్తోంది. ఎక్కడ చూసిన క్రికెట్ ఫీవర్. ఇక ఈరోజు అద్భుతమైన ఫైనల్ మ్యాచ్ అలరించ నుండి 2003 ప్రపంచకప్‌ తర్వాత భారత్‌-ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో(IND vs AUS World Cup 2023 Final) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్దక్రికెట్ మైదానమైన అహ్మదాబాద్‌ మోదీ స్టేడియంలో టైటిల్ కోసం భారత్ -ఆస్ట్రేలియా తలపడనున్నాయి. టోర్నీలో ఇప్పటివరకు అన్నిమ్యాచ్‌లు గెలిచి జోరుమీదున్న టీమిండియా ఫైనల్‌లోను జైత్రయాత్ర  కొనసాగించాలని కసిగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌లు ఓడి తర్వాత పుంజకున్న కంగారూ జట్టు తుదిపోరులోనూ గెలిచి 2003 ప్రపంచకప్‌ను రిపీట్ చేయాలని  భావిస్తోంది. 


ఈ నేపధ్యంలో లోనే గూగుల్ తన డూడుల్ని మార్చింది. సాధారణంగా  మనకు ఏదైనా ఇంటర్నెట్ కావాలంటే గూగుల్(Google) ఓపెన్ చేస్తాం. అయితే గూగుల్ ఓపెన్ చేయగానే అక్కడ మనకు గూగుల్ అని ఇంగ్లీష్ అక్షరాలతో ఒక డూడుల్(Goodle) కనిపిస్తుంది. కానీ  ఏదైనా ముఖ్యమైన రోజు అయితే మాత్రం గూగుల్ సంస్థ దానికి గౌరవంగా డూడుల్‌ను మార్చుతుంది. ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక సంఘటనలు, సందర్భాలను గుర్తు చేస్తూ, లేదంటే ఏదన్నా ముఖ్యమైన విషయాన్ని తెలిపేలా రావడం డూడుల్ స్పెషాలిటీ. అది విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రుడిపై అడుగు మోపిన సందర్భం కావచ్చు, ఎవరన్నా ప్రముఖుల పుట్టిన రోజులు కావచ్చు, ఇలా ఏ  ముఖ్యమైన ప్రతి విషయాన్ని గూగుల్ తన డూడుల్ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈరోజు కూడా గుగల్ తన డూడుల్ ని మార్చింది. యావత్ క్రీడా  ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు ప్రతీకగా తన డూడుల్ లో గూగుల్ లో ఓ(O) అక్షరానికి బదులు ట్రోఫీని , ఎల్(L) అక్షరానికి బదులుగా బ్యాట్ ను పెట్టింది. 


అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో..రెండుసార్లు టోర్నీ విజేత భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.మధ్యాహ్నం  రెండు గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ కోసం కోట్లాది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ పోరులో..... కచ్చితంగా విజయం  సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 2003 ప్రపంచకప్‌ ఫైనల్ పరాభవానికి  బదులు తీర్చుకోవాలని కసిగా కనిపిస్తోంది. ఈ టోర్నీ మొత్తం ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ ప్రణాళికబద్దంగా ఆడిన భారత్ ఫైనల్‌లోనూ అదే కొనసాగించాలని భావిస్తోంది. ఫైనల్  మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్ మరోసారి శుభారంభం ఇవ్వాలని కోహ్లీ అదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.   టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్ల జెర్సీలు ధరించి... వారి ఫోటోలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. టీమిండియా స్టార్‌ క్రికెటర్ల ఫొటోలకు వీర తిలకం దిద్ది పూజలు చేస్తున్నారు.


క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్‌-ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ కోసం BCCI, ICC సంయుక్తంగా భారీస్థాయిలో ఏర్పాట్లు... చేస్తున్నాయి. అతిరథ మహారథులు తరలిరానున్న ఈ మ్యాచ్‌కు ముందు..... భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ టీమ్ ఎయిర్ షో నిర్వహించనుంది సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ పది నిమిషాల పాటు అహ్మదాబాద్‌ స్టేడియంలో ఎయిర్ షో నిర్వహించనున్నట్లు రక్షణశాఖ అధికారి వెల్లడించారు. బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ప్రీతమ్‌, నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. టాస్‌కు ముందు ముంబయికి చెందిన 500 మంది నృత్యకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు.