IND vs AUS 3rd Test Target: అనూహ్య మలుపు తిరిగిన గాబ్బా టెస్టు చివరికి డ్రాగా ముగిసింది. జోరు వాన కారణంగా టీ బ్రేక్ తర్వాత మ్యాచ్ ఆడే వీలు లేకుండా పోయింది. అందుకే మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. పిచ్ బౌలింగ్ అనుకూలంగా ఉండటంతో భారత్‌ను త్వరగా ఆలౌట్ చేయాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా 89 పరుగులకే డిక్లేర్ చేసింది. తొలి సెషన్ ఆడిన తర్వాత రిక్లేర్ చేసి భారత్ ముందు 275 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇవాళ రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగుల చేసింది. మొత్తంగా టీమిండియా గెలవాలంటే 275 పరుగులు చేయాల్సి ఉండేది.
భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. ఐదో రోజు ప్రారంభంలో భారత జట్టు 8 పరుగులు మాత్రమే జోడించి ఆకాశ్‌దీప్ వికెట్ కోల్పోయి అలౌట్ అయింది. టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ 260 పరుగుల వద్ద ముగిసింది.
ఐదో రోజు ఆస్ట్రేలియా 185 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే దెబ్బ తీశాడు. ఉస్మాన్ ఖ్వాజా 8 పరుగులు చేసి ఔటవ్వగా, మార్నస్ లాబుషేన్ కేవలం 1 పరుగు చేసి ఔటయ్యాడు. ఆకాశ్‌దీప్ కూడా కంగారూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలోనే నాథన్ మెక్‌స్వీనీ, మిచెల్ మార్ష్‌ల వికెట్లు తీశాడు. మొహమ్మద్ సిరాజ్ కూడా వారిచ్చిన ఉత్సాహంతో స్టీవ్ స్మిత్‌ను, తర్వాత ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేశాడు.
గబ్బాలో చరిత్ర సృష్టిస్తుందని అనుకున్నారు. కానీ...
చివరిసారిగా గబ్బా మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడగా, టీమ్ ఇండియా 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. రిషబ్ పంత్ 89 పరుగుల ఇన్నింగ్స్ అద్భుతం చేశాడు. అప్పుడు 28 ఏళ్ల తర్వాత గబ్బా మైదానంలో ఓ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పుడు కూడా అలాంటి అద్భుతం చూస్తామనుకుంటే దానికి వరుణుడు అడ్డుపడ్డాడు. అయితే నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఈజీ కాకపోయినా ఏదైనా మ్యాజిక్ జరగబోతోందా అని అభిమానులు ఎదురు చూశారు. కానీ వరుణుడు అడ్డుపడ్డాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాలు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. వర్షం కారణంగా గాబా టెస్టు డ్రాగా ముగియడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో ఇరు జట్లకు 4-4 పాయింట్లు లభించా.యి. దీంతో ఫైనల్ రేసు మరింత ఉత్కంఠగా మారింది.
ఈ సిరీస్‌లో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాపై రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఆసీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.
కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో ఉస్మాన్ ఖవాజా వికెట్ తీసి కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు. కపిల్ దేవ్ పేరిట ఉన్న 51 వికెట్ల రికార్డును బుమ్రా అధిగమించాడు. ప్రస్తుత సిరీస్‌లో మూడో టెస్టు మ్యాచ్‌లో 20 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లు వికెట్ల కోసం ఇబ్బంది పడుతున్న టైంలో కూడా గబ్బా టెస్టులో బుమ్రా 6 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 3 వికెట్లు తీసి గేమ్ ఛేంజర్ అయ్యాడు.