Ind vs Aus 1st ODI perth pitch report |భారత క్రికెట్ జట్టుకు ఆదివారం ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. వాస్తవానికి టీమ్ ఇండియా శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో తొలి వన్డే సిరీస్ ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 19న పెర్త్‌లో మొదటి వన్డే ఆడనున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు టాస్ వేయనుండగా, 9 గంటలకు వన్డే ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు 26 ఏళ్ల శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఆడనున్నారు. ఆస్ట్రేలియా జట్టులోనూ రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ లేడు. అతని స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
పెర్త్ స్టేడియం పిచ్ రిపోర్ట్
పెర్త్‌లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే పెర్త్‌లో ఎప్పుడూ ఫాస్ట్ బౌలర్లకు సహకారం లభిస్తుంది. ప్రస్తుత వాతావరణం కారణంగా పెర్త్ పిచ్‌లో ఫాస్ట్ బౌలర్లు మునుపటి కంటే మరింత ప్రమాదకరంగా మారవచ్చు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటే ఫాస్ట్ బౌలర్లకు బౌన్స్‌తో పాటు స్వింగ్ కూడా రాబట్టే ఛాన్స్ ఉంది.
మ్యాచ్ ప్రిడిక్షన్
ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు తప్పదని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనా వేస్తున్నారు. జట్లు పరంగా చూస్తే టీమ్ ఇండియాదే కాస్త పైచేయిగా ఉంది. ఆస్ట్రేలియాకు సొంత మైదానంలో ఆడటం కలిసి రానుంది. కానీ జట్టులో చాలా మంది స్టార్ ఆటగాళ్లు లేరు. స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్ లేకపోవడంతో జట్టు మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో పాట్ కమిన్స్, ఆడమ్ జంపా లేరు. హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్ ఉంటంతో పేసర్లు ప్రమాదకరంగా మారవచ్చు.
ఆస్ట్రేలియా జట్టు ప్లేయింగ్ XI- ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాట్ రెన్షా, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మార్నస్ లాబుషేన్, మిచెల్ ఓవెన్, కూపర్ కోనోలీ, బెన్ డ్వార్షుయిస్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ ఎల్లిస్.
టీమ్ ఇండియా ప్లేయింగ్ XI- రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.