Ind u19 vs Pak u19 Final Live Streaming | ఆసియా కప్ 2025 అండర్-19 ఫైనల్లో (50 ఓవర్ల ఫార్మాట్) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. సుమారు 3 నెలల కిందట సీనియర్ల జట్టు మధ్య జరిగిన ఆసియా కప్‌లో కూడా ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగింది. అండర్-19 విషయానికొస్తే ఆయుష్ మ్హత్రే కెప్టెన్సీలో టీమిండియా సెమీఫైనల్‌లో శ్రీలంకను ఓడించింది. పాకిస్తాన్ మరో సమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

Continues below advertisement

భారత క్రికెట్ జట్టు 8 సార్లు అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ గెలుచుకుంది. గత ఎడిషన్ (2024)లో కూడా జట్టు ఫైనల్ వరకు చేరుకుంది కానీ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. పాకిస్తాన్ 2017 తర్వాత తొలిసారి ఫైనల్‌కు చేరింది. భారత్,  పాకిస్తాన్ చివరిసారిగా 2014 అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో తలపడ్డాయి. ఆ ఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో పాక్ మీద విజయం సాధించింది.

అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్ ఎప్పుడు?

భారత అండర్-19 జట్టు, పాకిస్తాన్ అండర్-19 జట్టు మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (డిసెంబర్ 21న) జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో జరగనుంది.

Continues below advertisement

IND U19 vs PAK U19 ఫైనల్ ఎన్ని గంటకు ప్రారంభం ?

అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 21న భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. అంతకు అరగంట ముందు అంటే టాస్ 10 గంటలకు ఉంటుంది.

భారత అండర్-19 జట్టు

ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, రాహుల్ కుమార్, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, ఆరోన్ జార్జ్, బి.కె. కిషోర్, జగన్నాథన్, కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్, యుగ్రాజ్ గోహిల్, అభిజ్ఞాన్ అభిషేక్ (వికెట్ కీపర్), హర్బన్స్ పంగాలియా (వికెట్ కీపర్), ఆదిత్య రావత్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, నమన్ పుష్పక్, ఉద్ధవ్ మనీష్ మోహన్, హెనిల్ పటేల్.

పాకిస్తాన్ అండర్-19 స్క్వాడ్

హసన్ బలోచ్, ఫర్హాన్ యూసుఫ్ (కెప్టెన్), సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), హుజైఫా అహ్సాన్, అబ్దుల్ ఖాదిర్, అబ్దుల్ సుభాన్, హమ్జా జహూర్ (వికెట్ కీపర్), అహ్మద్ హుస్సేన్, మహ్మద్ హసన్ ఖాన్, ఉమర్ జైబ్, మహ్మద్ షాయన్ (వికెట్ కీపర్), అలీ రజా, హసనైన్ దార్, ఇబ్తిసామ్ అజ్హర్, మహ్మద్ హుజైఫా, డానియల్ అలీ ఖాన్, మహ్మద్ సాయం, మోమిన్ కమర్, నికాబ్ షఫీక్.

IND U19 vs PAK U19 ఫైనల్ లైవ్‌ ఎక్కడ చూడాలి?

అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లైవ్ ప్రసారం సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో వస్తుంది. టీవీలో సోనీ స్పోర్ట్స్ 1 ఛానెల్‌లో లైవ్ మ్యాచ్ చూడవచ్చు. మొబైల్, డెస్క్‌టాప్ వినియోగదారులు సోనీ లివ్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో లైవ్ మ్యాచ్ వీక్షించవచ్చు.