Gabba Stadium: ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌, కోల్‌కత్తాలో ఈడెన్‌ గార్డెన్స్‌... ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌ ఇలా ప్రపంచ ప్రసిద్ధి పొందిన స్టేడియాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మైదానాల్లో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడడాన్ని ఆటగాళ్లు ఓ అదృష్టంగా భావిస్తారు. ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత పురాతన స్టేడియమైన గబ్బాను కూలగొడుతున్నారు. అధునాతన సౌకర్యాలతో పునర్నిర్మించేందుకు ఈ ప్రఖ్యాత స్టేడియాన్ని పడగొడుతున్నారు. 2032 ఒలింపిక్స్‌కు బ్రిస్బేన్‌ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో గబ్బానే ప్రధాన స్టేడియంగా ఎంపికైంది. బ్రిస్బేన్‌ స్టేడియాన్ని కూల్చి మళ్లీ కట్టడానికి సుమారు 15 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. 1895వ సంవత్సరంలోనే గబ్బాలో తొలిసారి క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. అధికారికంగా 1931 నుంచి క్రికెట్‌తో పాటు  రగ్బీ, ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌, సైక్లింగ్‌, అథ్లెటిక్స్‌ సహా ఎన్నో క్రీడలకు గబ్బా ఆతిధ్యం ఇచ్చింది. శతాబ్ద కాలంపాటు ఎన్నో ఆటలకు ఆతిథ్యం ఇచ్చిన ఈ స్టేడియాన్ని ఇప్పుడు మరింత అధునాతన నిర్మించడం కోసం కూలగొట్టబోతున్నారు. 2032 ఒలింపిక్స్‌లో గబ్బా స్టేడియమే ప్రధాన స్టేడియంగా ఎన్నిక కావడంతో దానిని మరింత అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు. 

 

బ్రిస్బేన్‌లో నిర్వహించబోయే ఒలింపిక్స్‌లో గబ్బా స్టేడియమే ప్రధాన స్టేడియం కానుంది. గబ్బాను త్వరలోనే నేలమట్టం చేసి దాని స్థానంలో కొత్త స్టేడియాన్ని పునర్నిర్మించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం పచ్చజెండా కూడా ఉంది. గబ్బాను 50 వేల మందికి సీటింగ్‌ కెపాసిటీని కల్పిస్తూ పునర్నిర్మించనున్నారు. సుమారు 2.7 ఆస్ట్రేలియా బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. బ్రిస్బేన్‌ ఒలింపిక్స్‌లో ప్రారంభ, ముగింపు వేడుకలతో పాటు అథ్లెటిక్స్‌ పోటీలను నిర్వహించనున్నారు. 2025కు ముందు యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇక్కడ టెస్టు మ్యాచ్‌ ముగిసిన తర్వాత గబ్బాను కూలగొట్టనున్నట్టు తెలుస్తోంది. 1956లో సిడ్నీ, 2000లో మెల్‌బోర్న్‌ తర్వాత బ్రిస్బేన్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనున్నది.

 

123 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ క్రికెట్‌ భాగమైంది. 2028 లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ అధికారికంగా చోటు దక్కించుకుంది. విశ్వక్రీడల్లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్‌తో పాటు స్క్వాష్‌, బేస్‌బాల్‌, లాక్రోస్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ చేసిన ప్రతిపాదనలకు ముంబయిలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ 141వ సెషన్‌లో ఆమోద ముద్రవేశారు. దీనిపై ఓటింగ్‌లో పాల్గొన్న 99 మంది ఐవోసీ సభ్యుల్లో కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. ఇప్పటివరకు విశ్వక్రీడల్లో క్రికెట్‌ను ఒక్కసారే ఆడారు. 1900వ సంవత్సరంలో జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడారు. అందులో ఫ్రాన్స్‌ను ఓడించి ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్‌ క్రీడల్లో క్రికెట్‌ భాగమైంది. పురుషులు, మహిళల విభాగాల్లో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-6 జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే విధంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ప్రతిపాదనలు చేసింది.. 

 

1900లో జరిగిన తొలిసారి ఒలింపిక్స్ లో క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. 128 సంవత్సరాల తర్వాత 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. 1900లో జరిగిన పారిస్‌ ఒలింపిక్ క్రీడ‌ల్లో క్రికెట్ ఆడించారు. ఆ ఏడాది ఫైన‌ల్లో ఫ్రాన్స్‌పై బ్రిట‌న్ గెలిచింది. ఆ రోజుల్లో ప్రతి జ‌ట్టులో 12 మంది ఆట‌గాళ్లు ఉండేవారు. రెండు రోజుల పాటు మ్యాచ్‌లు జ‌రిగేవి. కానీ ఆ తర్వాతి నుంచి ఈ ఆటను పక్కన పెట్టేసారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో ప్రతీ ఒలింపిక్స్ ముందు క్రికెట్‌ను చేర్చాలనే డిమాండ్ వ్యక్తమైంది.ఈ క్రమంలో ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడంపై ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు.