Ind vs WI ODI Smriti Mandhana Century: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలు దుమ్మురేపారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మిథాలీ రాజ్ సేన ప్రత్యర్థి విండీస్ మహిళల ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్లు ఓపెనర్ స్మృతి మందాన (123), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (109) శతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది.
టీమిండియాకు ఓపెనర్ల శుభారంభం..
వెస్టిండీస్‌తో జరుగుతున్న ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. సెడాన్ పార్కు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా(31 పరుగులు) శుభారంభం అందించారు. 6.3 ఓవర్లలో 49 పరుగులు జోడించాక శస్తికాను సెల్మాన్ ఔట్ చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరింది. దీప్తి శర్మ(15)తో కలిసి మందాన ఇన్నింగ్స్‌ను నడిపించింది.
సెంచరీ సాధించి జోరు మీదున్న స్మృతి అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. షమీలియా బౌలింగ్‌లో సెల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి 123 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె నిష్క్రమించింది. రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది. 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 100-3 తో మెరుగైన స్థితిలో ఉంది. ఆపై మందాన, హర్మన్ ప్రీత్ గేర్ మార్చారు. 25 ఓవర్లు ముగిసే సరికి స్మృతి మంధాన 44, హర్మన్‌ప్రీత్ కౌర్ 26 రన్స్‌తో ఉన్నారు. ఆపై మంధాన 67 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకోగా, వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన మంధాన శతకం (119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్స్) చేసిన తరువాత కాన్నెల్ బౌలింగ్‌లో సెల్మాన్ కు క్యాచిచ్చి ఔటైంది. అప్పటికి భారత్ 42.3 ఓవర్లోల 4 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది.
హర్మన్ ప్రీత్ సెంచరీ (Ind vs WI ODI Harmanpreet Kaur Century).. భారత్ భారీ స్కోరు
భారత వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 100 బంతుల్లో 100 పరుగులు చేసి అద్భుత శతకాన్ని నమోదు చేసింది. అయితే జట్టు స్కోరును పెంచే క్రమంలో 49వ ఓవర్లో హర్మన్ ప్రీత్ (107 బంతుల్లో 109, 10 ఫోర్లు, 2 సిక్సర్స్) ఔటైంది. ఓవరాల్ గా భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి విండీస్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. విండీస్ బౌలర్లలో మోహమ్మద్ 2 వికెట్లు పడగొట్టగా, కాన్నెల్, మాథ్యూస్, సెల్మాన్, డాటిన్, అలైన్ తలో వికెట్ తీశారు. భారత బ్యాటర్లను ఔట్ చేసేందుకు విండీస్ కెప్టెన్ ఏకంగా 8 మంది బౌలర్ల చేతికి బంతిని ఇవ్వాల్సి వచ్చింది.